పట్టణంలో వృధా నీటిని అరికట్టండి
ఫ్లెక్సీల నిర్వహణలో మున్సిపల్ అధికారులు నియమ నిబంధనలతో ఆదాయాన్ని పెంచండి
మున్సిపల్ పన్నుల వసూలులో వేగవంతాన్ని పెంచండి.. కౌన్సిల్ హాలులో కౌన్సిలర్లు డిమాండ్
విశాలాంధ్ర ధర్మవరం;; పురపాలక సంఘ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం పట్టణ సమస్యల పరిష్కారం పై కౌన్సిలర్లు తమదైన శైలిలో వ్యవహరించారు. మున్సిపల్ ఆదాయాన్ని పెంచే విధంగా అధికారుల కృషి ఎంతో అవసరమని, పట్టణములో నీరు వృధా కాకుండా చర్యలు చేపట్టాలని, ఫ్లెక్సీ నిర్వహణలో నియమ నిబంధనలు పాటించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, మునిసిపల్ పన్నుల విషయంలో అధికారులు సిబ్బంది వేగవంతాన్ని పెంచాలని కౌన్సిలర్లు తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ కాచర్ల లక్ష్మీ ఆధ్వర్యంలో కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 28 అంశాలతో పాటు టేబుల్ ఎజెండాను కూడా ఆమోదించే దిశలో చదివారు. కానీ అజెండాలోని పలు అంశాలపై కౌన్సిలర్లు తమ ఆమోదాన్ని తెలపలేదు. ఇందులో ,2 వ,3 వ,5 వ, 6వ,7 వ, 8వ,15 వ,16 వ,21 వ అంశాలను కౌన్సిలర్లు తిరస్కరించారు. మిగిలినవి ఆమోదించారు. తదుపరి పట్టణ వార్డు సమస్యలపై, అజెండాలోని పలు అంశాలపై వివిధ కౌన్సిలర్లు తమ అనుమానాలను బయట పెట్టారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ జయరాం రెడ్డి, కౌన్సిలర్లు రామకృష్ణ, నందమూరి నారాయణరెడ్డి, మాసపల్లి సాయి కృష్ణ, గజ్జల శివ, రమాదేవి, మేడాపురం వెంకటేష్, గోరకాటి పురుషోత్తం రెడ్డి, పెనుజూరు నాగరాజు మాట్లాడుతూ క్లచీలు నిర్వహణలో అన్ని రాజకీయ పార్టీలకు సమానంగా న్యాయం ఉండాలని, వైఎస్ఆర్సిపి ఫ్లెక్సీలు పెడితే తొలగించడం లాంటివి ఇకముందు జరిగితే, బాధ్యత మున్సిపల్ అధికారులు దేనిని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కుక్కలు ఎవరికైనా కరిస్తే డబ్బులు మున్సిపల్ కార్యాలయం ఇస్తుందా?, పాలకవర్గం ఇస్తుందా అని అడిగారు. అజెండాలోని మూడవ అంశంలో సరైన క్లారిటీ ఇవ్వాలని కౌన్సిలర్లు భీష్మించుకున్నారు. ఈ ఆటో వ్యవస్థ పై సరైన నిర్వహణ, వాటి వివరాలు తెలపాలని అడిగారు. ఆరవ అంశంలో యోగ డే సందర్భంగా మొత్తం లక్షల్లో ఖర్చు మున్సిపల్ కార్యాలయమే పట్టించుకోవాలా? ఇతర ప్రభుత్వ విభాగాలకు వర్తింపు లేదా అని సూటిగా ప్రశ్నించారు. ఈ విధంగా ప్రతిదీ మున్సిపల్ కార్యాలయమే చెల్లిస్తే లోటు తప్పదని వారు తెలిపారు. తదుపరి బండ గుంత విషయంలో పట్టణంలో ఉన్నటువంటి వేస్ట్ మట్టిని రాళ్ళను ఆ గుంతలోనే వేయాలన్న నిబంధన, నేడు టాక్టర్లు వాళ్లు మరిచారని, దీనివల్ల ఎక్కడపడితే అక్కడ వేయడం వల్ల అపరిశుభ్రత తాండవిస్తోంది అని తెలిపారు. కావున ట్రాక్టర్ల వాళ్లతో సమావేశాన్ని నిర్వహించి అందులోనే వేసే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. అంతేకాకుండా రక్షణ గోడకు మున్సిపల్ ఖర్చు పెట్టకుండా ఆ స్థల యజమానితోనే పెట్టించారని తెలిపారు. శానిటరీ పూర్తి స్థాయిలో పనిచేయాలని తెలిపారు. అదేవిధంగా వార్డులలో రెండు నెలలకు ముందు రోడ్డు వేశారు అప్పటికే అది చీలిక వ్యవస్థ ఏర్పడింది, కనీసం ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లనే మున్సిపాలిటీ కు నష్టం వచ్చిందని తెలిపారు. కళాజ్యోతి సర్కిల్ నుండి ఎర్రగుంట వరకు గల రహదారిలో స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతూ మృతి చెందుతున్నారని, వెలువెంటనే స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. కదిరి రైల్వే బ్రిడ్జ్ 20 నెలలు కావస్తున్నా కూడా ఇంకను పనులు చేయలేదని, అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చొరవతో జరిగిన కూడా నేటికీ పనులు నోచుక పోవడం దారుణం అన్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని తెలిపారు. మున్సిపాలిటీ కార్యాలయం నుంచి చెల్లించే విద్యుత్ బిల్లులను ఆదాయాన్ని పెంచుకొని చెల్లించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రస్తుతం ఎండాకాలం ఉన్నందున నీటి కొరత లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలని తెలిపారు. నీటి వృధా కాకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. డివైడర్లలో గల చెట్లు ఎండిపోతున్నాయని నీటి సరఫరా చేయాలని తెలిపారు. వాటర్ ప్లాంట్ లో ఫిల్టర్ చేయకుండా నీటిని విక్రయిస్తున్నారని, దీనివల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతారని తెలిపారు. కావున అధికారులు ఆకస్మిక తనిఖీలు చేసి పరిష్కరించాలని తెలిపారు. పట్టణంలో ప్లాస్టిక్ వాడకం అధికమైందని, పూర్తి నివారించే చర్యలు చేపట్టాలని తెలిపారు. అదేవిధంగా పాల డైరీ కేంద్రాలలో కల్తీ జరుగుతోందని, గత రెండు సంవత్సరాల కిందట ఫుడ్ ఇన్స్పెక్టర్లు మూడు పాల కేంద్రాలపై దాడులు జరిగి జరిమాణాలు విధించారని వారు గుర్తు చేశారు. కానీ పూర్తి స్థాయిలో డైరీ కేంద్రాలపై నిఘా ఉంచి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని తెలిపారు. అదేవిధంగా పట్టణంలో నీటి కుళాయిల అనుమతులతో కూడినటువంటి మాత్రమే ఉండాలని, అనధికారికంగా ఉన్న కొళాయిలను వెంటనే గుర్తించి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా పట్టణంలో కొంతమంది కొళాయి పైపు కనెక్షన్ నిమిత్తం సిసి రోడ్డును తొవ్వి, మరల వాటిని మర్చిపోవడంలో గుంతలు పడి ఎన్నో ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తదుపరి కౌన్సిలర్లు అడిగిన ప్రశ్నలకు మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య సమాధానమిస్తూ తప్పక వాటిపై చర్యలు తీసుకొని వచ్చే కౌన్సిల్ సమావేశంలో పూర్తిగా పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని వారు హామీ ఇచ్చారు. నూతన కమిషనర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంకట రమణయ్యకు కౌన్సిలర్లు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ లు జయరాం రెడ్డి, షమీయాబేగం, కో ఆప్షన్ నెంబర్లు, కౌన్సిలర్లు, పురపాలక వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.


