Homeఆంధ్రప్రదేశ్రాష్ట్రాభివృద్దే కూటమి ప్రభుత్వ లక్ష్యం

రాష్ట్రాభివృద్దే కూటమి ప్రభుత్వ లక్ష్యం

- Advertisement -

రెండేళ్లలో ఇచ్చిన హామీలను అమలు పర్చాం

వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తాం

కృష్ణా జలాలను అందిస్తాం

కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయోత్సవ సభలో…

జిల్లా ఇన్చార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

మార్కాపురం : రాష్ట్రాభివృద్దే లక్ష్యంగా ముందుకెళ్తున్న ఎన్ డి ఏ కూటమి ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండాలని ఉమ్మడి ప్రకాశం జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రజలను కోరారు. జిల్లా కేంద్రమైన మార్కాపురం పట్టణంలోని మార్కెట్ యార్డులో బుధవారం కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సభకు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రజలను మోసం చేసి పాలన కొనసాగించిందని,అలాగే ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని ఏద్దేవ చేశారు . తమ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన వెంటనే పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులను పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారని వివరించారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయడానికి అవసరమైన రూ 905 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. రాయలసీమ మాదిరిగా మార్కాపురం జిల్లాని ఆర్టికల్చర్ హబ్ గా తయారు చేయడానికి ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నా రన్నారు. శ్రీశైలం ఘాట్ రోడ్డును నాలుగు లైన్ల కారిడార్ గా అభివృద్ధి చేయడానికి ప్రధానమంత్రి ఆమోదం తెలిపారని చెప్పారు. రాష్ట్రంలో దేవాలయాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం రూ 16.84 కోట్ల లను మంజూరు చేసిందన్నారు. రాష్ట్రంలో 116 ఆలయాలకు దీప దూప నైవేద్యాలకు రూ 10 వేల చొప్పున 1.10 కోట్ల ను విడుదల చేయడం జరిగిందన్నారు.

రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ జిల్లా ప్రజల ఆకాంక్షల మేరకు వెలిగొండ పూర్తి చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు చెప్పారు. అందులో భాగంగా ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రతి నెల ప్రాజెక్టును సందర్శించడం జరుగుతుందన్నారు.

గత వైసిపి ప్రభుత్వం ప్రాజెక్టును పూర్తి చేయకుండానే జాతికి అంకితం చేసి ఈ ప్రాంత ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వంలో భూకబ్జాలు, ఇష్టానుసారంగా ఆన్లైన్లో చేసి జిల్లాను అధోగతి పాలు చేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మార్కాపురం జిల్లాని ప్రకటించారని, దీంతో జిల్లా ప్రజల కల నెరవేరిందని తెలిపారు. జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు పరిశ్రమలను స్థాపించే దిశగా ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నారన్నారు. ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి కోసం రూ 5 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. మార్కాపురం జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
జిల్లా అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని వివరించారు. జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత మాట్లాడుతూ జూలై చివరి నాటికి వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అదే విధంగా జల ధార జలహారతి, ఎన్టీఆర్ భరోసా, స్త్రీ శక్తి పథకాల ద్వారా ప్రజలు లబ్ధి పొందారని వివరించారు.

అంతకుముందు వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సంక్షేమ పథకాలకు సంబంధించిన ప్రత్యేక స్టాల్స్ ను మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ విజయ సునీత లు పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మారి టైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, కనిగిరి, గిద్దలూరు ఎమ్మెల్యేలు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, మత్తుముల అశోక్ రెడ్డి, ఎర్రగొండపాలెం నియోజక వర్గ టిడిపి ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు, టిడిపి స్టేట్ సెక్రెటరీ వక్కలగడ్డ మల్లికార్జునరావు, బిజెపి రాష్ట్ర మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్ర రెడ్డి, ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు పివి. కృష్ణారావు, ఏఎంసీ చైర్మన్ ఎమ్ .వెంకట రెడ్డి, ఆర్డీవో ఎమ్ .వెంకట శివరాం రెడ్డి, మున్సిపల్ కమిషనర్ డివిఎస్ నారాయణ ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు