Homeజిల్లాలుఅనంతపురంగీతారాణి డెల్టా డయాగ్నస్టిక్ సెంటర్ సేవలను వినియోగించుకోండి : డాక్టర్ గీతారాణి

గీతారాణి డెల్టా డయాగ్నస్టిక్ సెంటర్ సేవలను వినియోగించుకోండి : డాక్టర్ గీతారాణి

- Advertisement -

విశాలాంధ్ర – తాడిపత్రి: తాడిపత్రి పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంత ప్రజలు గన్నవారిపల్లి కాలనీలోని గీతారాణి డెల్టా డయాగ్నస్టిక్ సెంటర్ అందిస్తున్న ఆధునిక వైద్య నిర్ధారణ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆ సంస్థ ఎండీ, పాథాలజిస్టు డాక్టర్ గీతారాణి లింగుట్ల కోరారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తమ డయాగ్నస్టిక్ సెంటర్‌లో దాదాపు రూ. కోటి విలువైన అత్యాధునిక రక్త పరీక్ష పరికరాలను ఏర్పాటు చేశామని తెలిపారు. క్యాన్సర్, థైరాయిడ్, స్త్రీల ఆరోగ్య సమస్యలు సహా వివిధ వ్యాధులకు సంబంధించిన రక్త పరీక్షలను అత్యాధునిక సాంకేతికతతో నిర్వహిస్తున్నామని చెప్పారు.అలాగే హీమటాలజీ, బయోకెమిస్ట్రీ, సైటాలజీ, హిస్టోపాథాలజీ, క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు, స్త్రీలలో కనిపించే వివిధ క్యాన్సర్లకు సంబంధించిన ప్రత్యేక పరీక్షలు కూడా అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. గతంలో ఇటువంటి ప్రత్యేక పరీక్షల కోసం హైదరాబాద్, ముంబై వంటి నగరాలకు వెళ్లాల్సి వచ్చేదని, ప్రస్తుతం తాడిపత్రిలోనే ఈ సేవలు లభిస్తున్నాయని వివరించారు.45 సంవత్సరాలు పైబడిన మహిళలు, పురుషులు తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, దీంతో శరీరంలో ఉన్న లోపాలు లేదా వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి సకాలంలో చికిత్స అందించే అవకాశం ఉంటుందని సూచించారు. అన్ని రకాల రక్త పరీక్షలను సరసమైన ధరల్లో అందిస్తున్నామని, తాడిపత్రి పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంత ప్రజలు గీతారాణి డెల్టా డయాగ్నస్టిక్ సెంటర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ గీతారాణి లింగుట్ల విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు