Homeజిల్లాలుఅనంతపురంకుష్టు వ్యాధిపై అవగాహన కార్యక్రమాలు

కుష్టు వ్యాధిపై అవగాహన కార్యక్రమాలు

- Advertisement -

30 నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు నిర్వహణ: ఇంచార్జ్ కలెక్టర్ శ్రీ విష్ణు చరణ్
విశాలాంధ్ర అనంతపురం టౌన్: జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా జనవరి 30 తేదీ (జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా) నుండి ఫిబ్రవరి 13వ తేదీ వరకు కుష్టు వ్యాధిపై ప్రజలకు సంపూర్ణ అవగాహన కలిగించడం కోసం “స్పర్శ “కార్యక్రమం నిర్వహించడం లో భాగంగా ప్రజలకు అవగాహన కొరకు జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ సి.విష్ణు చరణ్ కుష్టు వ్యాధికి సంబంధించిన కరపత్రాలను, బుధవారం ఫ్లెక్సీలను విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… వైద్య ఆరోగ్య సిబ్బందితోపాటు అన్ని అనుబంధ శాఖలు సమన్వయంతో జిల్లాలోని పాఠశాల యందు’ మహిళా సంఘాల యందు గ్రామ వార్డు సచివాలయంల లో స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్య సమన్వయం చేసుకొని ప్రజలందరికీ కుష్టి వ్యాధి పై సంపూర్ణంగా అవగాహన కల్పించాలని తద్వారా కుష్టు వ్యాధిని సమూలంగా నిర్మూలించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కుష్టు,హెచ్ఐవి ఎయిడ్స్ మరియు టీవీ అధికారి డాక్టర్ జయలక్ష్మి మాట్లాడుతూ మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం జనవరి 30 తేదీ నుండి ఫిబ్రవరి 13వ తేదీ వరకు 15 రోజులు పాటు కుష్టి వ్యాధి నిర్మూలనే ధ్యేయంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతున్నదని ఇందులో భాగంగానే ప్రజల అవగాహన కోసం కరపత్రాలను ఫ్లెక్సీలను ముద్రించి జిల్లా కలెక్టర్ చేతులమీదుగా విడుదల చేయడం జరిగిందని తెలిపారు.
ఈ 15 రోజులు పాటు జిల్లా వ్యాప్తంగా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ముందుండి అన్ని అనుబంధ శాఖల సిబ్బందితో సమన్వయం చేసుకొని ప్రజలందరికీ కుష్టు వ్యాధి పై అవగాహన పెంచడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ మల్లీశ్వరి, జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త డాక్టర్ పాల్ సెల్వరాజ్, మల్లికార్జున్ రెడ్డి, పారామెడికల్ అధికారి నాగన్న, స్టాటిస్టికల్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు