- Advertisement -
విశాలాంధ్ర – కొయ్యలగూడెం : (ఏలూరు జిల్లా) : బడుగు బలహీన వర్గాల వారి కోసం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చేసిన కృషి భావితరాలకు ఎంతో స్ఫూర్తిదాయకం అని మాల మహానాడు జిల్లా సెక్రెటరీ కరుటూరి చంటిబాబు పేర్కొన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మాల మహానాడు మండల అధ్యక్షుడు తొర్లపాటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు యూత్ అధ్యక్షుడు బొడ. శేఖర్ బాబు, శూలం వెంకటరమణ, రాజేశ్వరరావు, వెంకట్రావు, తగరం కిరణ్, పాల్గొన్నారు.


