విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని డిఎస్పీ కార్యాలయంలో గత కొన్ని నెలలుగా డి.ఎస్.పి లేకపోవడంతో ఇంచార్జ్ వ్యవస్థ కొనసాగింది. ఎట్టకేలకు ప్రభుత్వం నూతన ధర్మవరం డిఎస్పీగా బి.వి. జగన్నాథరాజును ధర్మవరం డిఎస్పీగా బదిలీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా డిఎస్పి సోమవారం డి.ఎస్, పి కార్యాలయంలో పదవీ బాధ్యతలను చేపట్టారు. వీరు వైజాగ్ రేంజ్ సిఐ గా విధులు నిర్వర్తిస్తూ పదోన్నతి పై ధర్మవరం డిఎస్పీగా రావడం జరిగింది. అనంతరం వారు జిల్లా ఎస్పీను గౌరవపూర్వకంగా కలవడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ ధర్మవరం డివిజన్ పరిధిలోని ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటానని, ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కరించే దిశగా తాను కృషి చేస్తానని వారు తెలిపారు. తదుపరి పలువురు సిఐలు, ఎస్సైలు, డీఎస్పీ కార్యాలయ సిబ్బంది కలసి నూతన డిఎస్పి కి పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు.
నూతన డిఎస్పీగా పదవీ బాధ్యతలు చేపట్టిన బివి జగన్నాథ రాజు
- Advertisement -
RELATED ARTICLES


