విశాలాంధ్ర ధర్మవరం : ధర్మవరం రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో గత కొన్ని నెలలుగా ఆర్డీవో పోస్ట్ ఖాళీగా ఉండడం, కొంతమంది అధికారులు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇన్చార్జిగా వ్యవహరించారు. ఎట్టకేలకు ప్రభుత్వం ధర్మవరం ఆర్డీవో గా ఓ. రామ భూపాల్ రెడ్డిని నియమించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వారు సోమవారం ఉదయం ఆర్డిఓ కార్యాలయంలో పదవీ బాధ్యతలను స్వీకరించారు. వీరు నంద్యాల ఎస్ ఆర్ బి సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా ఉంటూ, ధర్మవరం ఆర్డీవో గా బదిలీపై రావడం జరిగింది. అనంతరం రామ భూపాల్ రెడ్డి మాట్లాడుతూ రెవెన్యూ డివిజన్ పరిధిలోని సమస్యలను పరిష్కరిస్తానని, రెవెన్యూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని వారు తెలిపారు. అనంతరం వారు జిల్లా కలెక్టర్ గౌరవపూర్వకంగా కలిసి తిరిగి విధుల్లో చేరారు. ఈ సందర్భంగా ఆర్డీవో కార్యాలయ ఏవో ఖతీజూన్ కుప్రా తోపాటు అధికారులు, సిబ్బంది నూతన ఆర్డీవోకు శుభాకాంక్షలు తెలియజేశారు
పదవీ బాధ్యతలు చేపట్టిన నూతన ఆర్డీవో ఓ రామ భూపాల్ రెడ్డి
- Advertisement -
RELATED ARTICLES


