గత గురువారం నుంచి మణిపూర్ మళ్లీ భగ్గుమంటోంది. హింసకు దిగినవారిని కట్టడి చేయడానికి పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించాడు. పరిస్థితిని అదుపు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అదనంగా మరో 50 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలను పంపింది. దీనితో మణిపూర్‌లో నియోగించిన కేంద్ర సాయుధ పోలీసుదళాల సంఖ్య అయిదువేలకు చేరింది. సోమవారం నాటికి హింసాత్మక సంఘటనలు మరింత పెచ్చరిల్లాయి. మెయితీ వర్గానికి చెందిన రెండేళ్ల బాలుడి తల లేని మొండెం, ఆ బాలుడి నాయనమ్మ అర్థ నగ్న మృతదేహం బరాక్ నదిలో తేలుతూ కనిపించాయి. మెయితీలు, కుకీల మధ్య ఘర్షణల్లో మరో ఆరుగురు మరణించారంటున్నారు. భద్రతా దళాలకు కుకీ ఆందోళన కారులకు మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. పరిస్థితి విషమించిన తరవాత మణిపూర్‌లోని చాలా చోట్ల కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్ సదుపాయాన్ని నిలిపివేశారు. పాఠశాలలు, కళాశాలలతో పాటు అన్ని విద్యా సంస్థలను మంగళవారం దాకా మూసేశారు. ఈ లోగా మణిపూర్‌లో అధికారంలో ఉన్న ఎన్.డి.ఎ. ప్రభుత్వానికి నేషనల్ పీపుల్స్ పార్టీ నాయకుడు కోన్రాడ్ సంగ్మా మద్దతు ఉపసంహరించారు. అయితే ఎన్.డి.ఎ. ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీలేదు. మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ అసమర్థత, తన బాధ్యతను పూర్తిగా విస్మరించిన మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఉదాసీనత వల్ల గత 19 నెలలుగా మణిపూర్ అగ్నిగుండంగా మారింది. మణిపూర్‌లో పరిస్థితిని చక్కదిద్దడానికి మోదీ సర్కారు ఇంతవరకు చేసింది ఏమీలేదు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఉదాహరణ ప్రాయంగా ఒక్కసారి మణిపూర్ వెళ్లివచ్చారు. కానీ ఆయన ఘర్షణ పడ్తున్న మెయితీ, కుకీల ప్రతినిధులతోగానీ, సామాన్య ప్రజలతోగానీ సంప్రదింపులు జరపనేలేదు. కనీసం బాధితులను పరామర్శించిన పాపాన కూడా పోలేెదు. అతిథిగృహంలో కూర్చుని కొంతమంది ఉన్నతాధికారులను పిలిపించి పరిస్థితిని సమీక్షించాననిపించుకుని దిల్లీ వెళ్లిపోయారు. ప్రధానమంత్రి మోదీ అయితే దేశదేశాలూ తిరుగుతున్నారు కానీ 2023 మే మూడు నుంచి మణిపూర్‌లో హింసాత్మక సంఘటనలు జరుగుతున్నా ఆ రాష్ట్రాన్ని సందర్శించాలన్న ఆలోచనే ఆయనకు రాలేదు. ఈ లోగా డజన్ల కొద్దీ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. అనేక విదేశీయాత్రలు చేసి వచ్చారు. ఇప్పుడు కూడా ఆయన విదేశీ యాత్రల్లోనే ఉన్నారు. మణిపూర్‌లో అంటుకున్న అగ్గిని ఆర్పేయడానికి మోదీ చేసిందేమీ లేకపోయినా రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం నిలిపివేయిస్తానని ప్రగల్భాలు పలుకుతున్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్న అమిత్ షా మణిపూర్‌లో పరిస్థితి విషమించిందని తెలిసి ప్రచారం మధ్యలోనే నిలిపివేసి దిల్లీ పరుగెత్తారు. అక్కడా ఆయన చేసిందల్లా సమీక్షా సమావేశాలు నిర్వహించడమే. హింస చెలరేగుతున్న ప్రాంతంలో పరిస్థితిని అదుపు చేయడానికి అమిత్ షా కూడా చేసింది, చేస్తున్నది ఏమీలేదు. మణిపూర్ మండిపోతుంటే ఇంత ఘోరంగా నిష్క్రియాపరత్వం ప్రదర్శించడం మోదీకి, అమిత్ షాకే చెల్లింది. అక్కడి గవర్నర్ హింస చెలరేగిన వెంటనే పరిస్థితిని కట్టడి చేయాలని అమిత్ షాకే కాక రాష్ట్రపతికి కూడా మొరపెట్టుకున్నారు. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్‌ను తొలగించాలని ఎంతమంది చెప్తున్నా మోదీ ప్రభుత్వ చెవికెక్కడం లేదు.
డబుల్ ఇంజన్ సర్కారు ఉంటే ఏ రాష్ట్రమైనా త్వరితగతిన అభివృద్ధి చెందుతుందని, శాంతి భద్రతలు సుస్థిరంగా ఉంటాయని ఊదరగొడ్తున్న మోదీ ప్రభుత్వం మణిపూర్‌ను మాత్రం పట్టించుకోవడంలేదు. నిజానికి అక్కడ అధికారం సంపాదించడానికి మెయితీ, కుకీ జాతుల మధ్య తంపులు పెట్టిందే మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం. జాతి కలహాలు ఇప్పుడు అక్కడ పెద్ద భూతంలా తయారయ్యాయి. గత 19 నెలల కాలంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అనేకమంది మహిళలమీద అత్యాచారాలు జరిగాయి. మహిళలను నగ్నంగా ఊరేగించారు. ఇదంతా ఏదో పరాయి దేశంలోనో, మనకు సంబంధంలేని వ్యవహారంగానో మాత్రమే మోదీ సర్కారు భావిస్తోంది. శాంతి భద్రతలు పరిరక్షించడానికి లేదా రాజకీయ పరిష్కారం కనుగొనడానికి కానీ చేసిందేమీలేదు. భిన్న జాతుల వారి మధ్య విద్వేషంనింపి అధికారం మాత్రం సంపాదించింది. సామాజిక-రాజకీయ విభేదాలకు ఆజ్యం పోసింది. మణిపూర్‌లో కొనసాగుతున్న విధ్వంసం మునుపెన్నడూ లేనిదని, ఈ చిచ్చును చల్లార్చడానికి రాజకీయ, పరిపాలనాపరమైన తగిన చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు చెవిని ఇల్లుకట్టుకుని చెప్తున్నా మోదీ ప్రభుత్వంలో చలనంలేదు. మెయితీ మద్దతుదార్లు ప్రభుత్వ కార్యాలయాలకు తాళం పెడ్తున్నారు. కర్ఫ్యూ ఉల్లంఘించి మెయితీ ఉద్యమకారులు ప్రభుత్వ కార్యాలయాలను స్వాధీనం చేసుకుంటున్నారు. సోమవారం నాటికి బయటపడ్డ ఏడు మృతదేహాలు కూడా అంతకు ముందు కుకీలు అపహరించుకువెళ్లిన వారివేనంటున్నారు. ఇంఫాల్ లోయలోని అయిదు జిల్లాల్లో మెయితీల ప్రభావం ఎక్కువ. ఆందోళనకారులు ఎన్నికల అధికారి కార్యాలయాన్ని కూడా ఆక్రమించారు. ఇంటర్నెట్ సదుపాయం నిలిపివేస్తే సమస్య పరిష్కారం అవుతుందన్న ప్రభుత్వ ఆలోచన కేవలం భ్రమే. దీనివల్ల అందవలసిన సమాచారం అందకుండా పోతోంది. ఇది అదనపు సమస్యలకు దారి తీస్తోంది. మణిపూర్‌లో హింసాకాండ చెలరేగుతుంటేనే బీజేపీకి ప్రయోజనం అన్న ఆరోపణలూ వస్తున్నాయి. కనీసం వీటిని ఖండిరచడానికైనా మోదీ ప్రభుత్వంలో కదలిక కనిపించడం లేదు. మణిపూర్‌లోని వివిధ పక్షాలతో సంప్రదించాలని, ఆ తరవాత దిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి ఏం జరుగుతోందో వివరించి పరిస్థితి అదుపు చేయడానికి ఏం చేయాలో నిర్ణయించాలని ప్రతిపక్షాలు ఎన్నిసార్లు విజ్ఞప్తిచేసినా మోదీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. నవంబర్ 25న పార్లమెంటు సమావేశాలు మొదలయ్యే లోగా అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తే పరిస్థితి సానుకూలంగా మారుతుంది. ఈ సూచననూ మోదీ సర్కారు ఖాతరు చేయడంలేదు. ప్రతిపక్ష పార్టీలు సాధారణంగా ఏ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించినా విమర్శిస్తాయి. కానీ మణిపూర్‌లో అసమర్థ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్‌ను తొలగించి రాష్ట్రపతి పాలన విధిóంచాలని ప్రతిపక్షాలు కోరుతున్నా మోదీ ప్రభుత్వం మౌనమే సమాధానం అన్నట్టుగా ఉంది. కేంద్ర ప్రభుత్వం చేసిందల్లా పౌరుల మీద జరిగిన మూడు కేసుల దర్యాప్తు బాధ్యతను జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించడమే. కేంద్రం తీసుకున్న మరో చర్య ఏమిటంటే సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (ఎ.ఎఫ్.ఎస్.పి.ఎ.) మళ్లీ అమలు చేయడమే. బీజేపీ, కాంగ్రెస్ నాయకుల ఇళ్ల మీద దాడులు జరుగుతున్నాయి. శనివారం ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ చెందిన ఇంటిమీద కూడా దాడి చేశారు. ఒక ఎమ్మెల్యే అయితే తన ఇంటి చుట్టూ బంకర్లు నిర్మించుకు కూర్చున్నారు. తీవ్ర దాడులు ఎదుర్కుంటున్న మెయితీలు ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉంది.
మండుతున్న మణిపూర్‌నిశ్చేష్టంగా మోదీ
కార్పెంటర్స్, పెయింటర్స్ సమస్యల పరిష్కారమే మా లక్ష్యం.. నూతన కమిటీ
విశాలాంధ్ర ధర్మవరం:: కార్పెంటర్స్ అండ్ పెయింటర్స్ సమస్యల పరిష్కారమే మా లక్ష్యము అని నూతన కమిటీ వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కార్పెంటర్స్, పెయింటర్స్ యూనియన్ పెద్దలను కలిసి సమావేశమును నిర్వహించారు. ఈ సమావేశంలో సమస్యలపై తీవ్రంగా చర్చించి సమస్యల పరిష్కారానికి ఐక్యమత్యంతోనే మార్గం సుగమం అవుతుందని తెలిపారు. తదుపరి నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ నూతన కమిటీలో కార్పెంటర్ అధ్యక్షులుగా కే. శివ, ప్రధాన కార్యదర్శిగా కే.నంజుండ చారి, పెయింటర్ అధ్యక్షుడుగా గడ్డం రాజు, కోశాధికారిగా సాయిరాజును ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. పట్టణంలో ఏ సమస్య అయినా ఎదురైనప్పుడు కలిసికట్టుగా చర్చించి పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ సమన్మయంతో, ఐక్యమత్యంతో ముందుకు వెళ్లాలని తెలిపారు.
వ్యాసరచన పోటీలో ప్రణవ సాయి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థికి ప్రథమ బహుమతి
విశాలాంధ్ర ధర్మవరం : భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి 99 వ జన్మదినోత్సవ వేడుకలు సందర్భంగా పట్టణంలోని కాగితాల వీధిలో గల శ్రీ ప్రణవ సాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఇటీవల నిర్వహించడం జరిగింది. పట్టణంలోని 24 పాఠశాలల నుండి 1500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అదేవిధంగా ఐదు జూనియర్ కళాశాల నుండి నూరు మంది రెండు డిగ్రీ కళాశాల నుండి 35 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. జిల్లా స్థాయిలో ప్రణవ సాయి ఇంగ్లీష్ మీడియం పాఠశాల నుండి టి మమతారెడ్డి ప్రథమ బహుమతిని గెలుపొందడం జరిగిందని జిల్లా జాయింట్ బాలవికాస్ కోఆర్డినేటర్ కరణం ఆదిలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూనియర్ కళాశాల నుండి షేక్ పర్వీన్ తాజ్ ద్వితీయ బహుమతిని, పద్మావతి డిగ్రీ కళాశాల నుండి టీ. అర్సియా ద్వితీయ బహుమతిని గెలుపొందడం జరిగిందని తెలిపారు. త్వరలో వీరందరికీ పుట్టపర్తిలో బహుమతులను ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆదిలక్ష్మి తో పాటు శ్రీ సత్యసాయి సేవా సమితి తరపున జాయింట్ కన్వీనర్ శేషాచారి,కన్వీనర్ నామ ప్రసాద్, జనార్ధన్, ప్రధమ, ద్వితీయ పొందిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
చట్ట పరిధిలోనే జీవించాలి…
రూరల్ ఎస్సై శ్రీనివాసులు
విశాలాంధ్ర -ధర్మవరం: చట్ట పరిధిలోనే గ్రామ ప్రజలు జీవించాలని, చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకున్నప్పుడే మంచి జీవితం లభిస్తుందని రూరల్ ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా వారు జిల్లా ఎస్పీ, డి.ఎస్.పి, రూరల్ సీఐ ఆదేశాల మేరకు ప్రతిరోజు ఓ గ్రామంలో గ్రామ సభను నిర్వహించి, చట్టాలపై అవగాహన నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే మండల పరిధిలోని సీతారాంపల్లి గ్రామంలో గ్రామ సభను ఏర్పాటు చేశారు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ గొడవలకు దూరంగా ఉండాలని, ఏదైనా సమస్య ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, పేకాటకు దూరంగా ఉండాలని, మద్యానికి బానిస కాకూడదని వారు తెలిపారు. తదుపరి సైబర్ క్రైమ్ పైన రోడ్డు సేఫ్టీ పైన కూడా అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. చిన్నచిన్న గొడవలకు పోరాదని, పోలీస్ స్టేషన్లు చుట్టూ కోర్టులు చుట్టూ తిరిగితే సమయం వృధా అవుతుందని, సమన్వయంతో ఆలోచనతో నిర్వహిస్తే అంతా సుఖప్రదం అవుతుందని తెలిపారు. అంతేకాకుండా నాటు సారా కాచడం, అసాంఘిక కార్యకలాపాలు చేస్తే చట్ట పరంగా కఠిన చర్యలతో పాటు కేసులు నమోదు చేస్తామని వారు హెచ్చరించారు. బాల్య వివాహాలు చేయరాదని, బాలికలు ఉన్నత స్థాయి వరకు చదివించే ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తుందని, ప్రభుత్వ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. గ్రామాల్లో కొత్త వ్యక్తులు వస్తే నిగా ఉంచి మా పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని తెలిపారు. గ్రామ ప్రజలందరూ సమన్వయంతో ఐక్యమత్యంతో మెలిగినప్పుడే గ్రామ అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ పోలీసులు పాల్గొన్నారు.
ద్వాదశ జ్యోతిర్లింగ స్థూపం ఆవిష్కరణ కార్యక్రమం.. జీర్ణోదరణ సంఘం
విశాలాంధ్ర- ధర్మవరం:బీ పట్టణంలోని చెలిమి రోడ్డు వద్ద గల శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో చెలిమి జీర్నోద్ ధారణ సంగం ఆధ్వర్యంలో కార్తీకదీపం తో పాటు ద్వాదశ జ్యోతిర్లింగ స్థూపం యొక్క ఆవిష్కరణ కార్యక్రమం ఈనెల 25వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు శ్రీ భక్తాంజనేయ స్వామి వారి సన్నిధానమున నిర్వహిస్తున్నట్లు చెలిమి జీర్ణో ధారణ సంఘము సీతారామాంజనేయ స్వామి మహిళా మండలి వారు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈనెల 25న గణపతి పూజ, గంగా, శివ, గంగ హారతి, గంగాభవాని విశేష పూజల కార్యక్రమంతో పాటు కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ధర్మారం ఎమ్మెల్యే, ఆరోగ్యశాఖ మంత్రులు సత్త కుమార్ యాదవ్, ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిలక్క మధుసూదన్ రెడ్డి, పర్సనల్ సెక్రెటరీ ఉపముఖ్యమంత్రి ఆంధ్ర ప్రదేశ్ మధుసూదన్, ఆర్డీవో మహేష్, మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ తదితరులు హాజరవుతున్నట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమం అర్చకులు మోహన్ స్వామి చంద్రమౌళి స్వామి వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తామని తెలిపారు. కావున ఈ కార్యక్రమానికి భక్తాదులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.
కనకదాస విగ్రహానికి ఘన నివాళులు
మంత్రి ఎస్.సవిత
విశాలాంధ్ర -అనంతపురం : శ్రీ భక్త కనకదాస రాష్ట్రస్థాయి జయంతోత్సవాలలో భాగంగా సోమవారం అనంతపురం నగరంలోని గుత్తి రోడ్డులో ఉన్న కనకదాస విగ్రహానికి రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత మరియు జౌలి శాఖ మంత్రి ఎస్.సవిత పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అనంతపురం, హిందూపురం ఎంపీలు అంబిక లక్ష్మీనారాయణ, బీకే.పార్థసారథి, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, రాష్ట్ర బి.సి.వెల్ఫేర్ ప్రిన్సిపాల్ సెక్రటరీ పోలా భాస్కర్, ఐఏఎస్, రాష్ట్ర బీసీ వెల్ఫేర్ సంచాలకులు మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్.ఏ.మల్లికార్జున ఐ.ఏ.ఎస్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి తదితరులు కనకదాస విగ్రహానికి పుష్పమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీమతి ఎస్.సవిత మాట్లాడుతూ శ్రీ భక్త కనకదాస జయంతోత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. రాష్ట్రస్థాయి కనకదాస జయంతోత్సవాల కార్యక్రమాన్ని ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేశామన్నారు. శ్రీ భక్త కనకదాస అందరికీ దశ, దిశ నిర్దేశం చేశారని, అందరూ సంఘటితంగా పోరాడితే మనం ఏదైనా సాధించగలమని చెప్పి కీర్తనల ద్వారా ఊరూరా తిరిగి ప్రతి ఒక్కరినీ చైతన్యవంతం చేశారన్నారు. ప్రతి ఒక్కరూ దేవుని దర్శనం చేసుకోవాలనే ధ్యేయంగా ఆయన మార్గనిర్దేశం చేశారన్నారు. అధికారికంగా కనకదాస జయంతిని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. కురుబ కులంలో కనకదాసు జన్మించడం గొప్ప వరంగా భావిస్తున్నామన్నారు.
ఈ సందర్భంగా హిందూపురం ఎంపీ బీకే.పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అధికారికంగా కనకదాస రాష్ట్రస్థాయి జయంతోత్సవాలను జరుపుకుంటున్నామన్నారు. శ్రీ భక్త కనకదాస యుగ పురుషుడని, కురుబ కులానికి వన్నెతెచ్చిన వ్యక్తి అని, ఆయన అడుగుజాడల్లో తామంతా నడిచేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, వెనుకబడిన తరగతుల సహకార సంఘాల నాయకులు, ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ స్కూల్ స్వీపర్లు, వాచ్‌మెన్లకు బకాయి ఉన్న 7 నెలల వేతనాలు వెంటనే చెల్లించాలి
ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ ) జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ గౌడ్
విశాలాంధ్ర- అనంతపురం : అనంతపురము నగరపాలక సంస్థలోని మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ ) జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ గౌడ్ డిమాండ్ చేశారు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ ) ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ కు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా రాజేష్ గౌడ్ మాట్లాడుతూ… నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న కార్మికులకు అవసరానికి తగ్గట్టుగా పనిమూట్లు ఇవ్వాలన్నారు,చనిపోయిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులను విధుల్లోకి తీసుకొని వారికి రావాల్సిన ఈ పి ఎఫ్ ,ఈ ఎస్ ఐ బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలన్నారు,ఇంజనీరింగ్ కార్మికులకు వేతనాలు తక్కువ ఇస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి వస్తున్న సంక్షేమ పథకాలు పోయిన ప్రభుత్వం నిలుపుదల చేసింది ఈ ప్రభుత్వం తిరిగి ఇవ్వాలన్నారు,ఇంజనీరింగ్ కార్మికులకు బకాయి ఉన్న 2011 సం,,లోని 9 నెలల ఈ పి ఎఫ్ సొమ్మును కార్మికుల ఖాతాల్లో జమచేయాలన్నారు, మున్సిపల్ స్కూల్స్ లో పనిచేస్తున్న స్వీపర్లుడవాచ్మెన్ల కు బకాయి ఉన్న 7 నెలల వేతనాలు వెంటనే ఇస్తూ నేరుగా కార్మికుల ఖాతాల్లోకి వేతనాలు జమచేయాలన్నారు. నగర జనాభాకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలన్నారు. కార్మికుల సమస్యలు త్వరితగతిన పరిష్కరించారని లేనిపక్షంలో ఉద్యమానికి శ్రీకారంచుడతామన్నారు,
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నగర ప్రధాన కార్యదర్శి కృష్ణుడు,Aూ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు చిరంజీవి, నాయకులు వేణుగోపాల్,రఫీ,అసేన్,లక్ష్మిదేవి,తిమ్మప్ప,నారాయణస్మామి,సాయి తదితరులు పాల్గొన్నారుౌ
రుద్రంపేట పంచాయతీ సచివాలయం వద్ద సి పి ఐ ధర్నా
విశాలాంధ్ర అనంతపురం అనంతపురం రుద్రంపేట పంచాయతీ, చంద్రబాబు నగర్ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ శాఖ ఆధ్వర్యంలో ఇల్లు లేని నిరుపేదలకు.2. సెంట్లు స్థలం ఇళ్ల నిర్మించడానికి రూ 5.లక్షలు. ఇసుక.స్టీలు ఉచితంగా ఇవ్వాలని కోరుతూ దాదాపుగా 200 మంది.సచివాలయం రెండు వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి పంచాయతీ కార్యదర్శి హిదై తుల్లా కి అర్జీలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర నాయకులు రామకృష్ణ పిలుపుమేరకు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా.నగర సహాయ కార్యదర్శి అల్లిపీర నగర కార్యవర్గ సభ్యులు రామయ్య, వరలక్ష్మి, చంద్రబాబు నగర్ సిపిఐ శాఖ కార్యదర్శి ఖాజా మొహినిద్దీన్ . సహాయ కార్యదర్శి నరసింహులు, కార్యవర్గ సభ్యులు. మదర్ సాబ్. ఆటో బాషా. మెకానిక్ నాగరాజు. సాదిక్ .సిపిఐ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
ఏపీ సి యూ లో యువ మంథన్ విద్యార్థి మోడల్ పార్లమెంట్
విశాలాంధ్ర-అనంతపురం : ఆంధ్ర ప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో యువ మంథన్ విద్యార్థి మోడల్ పార్లమెంట్ యూజీసీ యువ మంథన్ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాయంలో యూత్ పార్లమెంట్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య పోషకులుగా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎస్. ఎ. కోరి వ్యవహరించగా, డీన్ ఆచార్య సి. షీలారెడ్డి కార్యక్రమ పోషకులుగా వ్యవహరించారు. విద్యార్థి సంక్షేమ శాఖ డీన్ ఆచార్య జి. రామ్ రెడ్డి గౌరవ అతిథిగా పాల్గొన్నారు. వివిధ విభాగాలకు చెందిన 50 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… నిజమైన పార్లమెంటులో ప్రధానంగా జరిగే ప్రమాణ స్వీకారం, సంస్మరణ సూచనలు, క్వశ్చన్ అవర్, కాలింగ్ అటెన్షన్ డ శాసన కార్యకలాపాలు వంటి అనేక అంశాలను ప్రతిబింబించే విధంగా మోడల్ యూత్ పార్లమెంట్ నిర్వహించారన్నారు . విద్యార్థినీ విద్యార్థులలో ఆధునిక పార్లమెంట్ పట్ల ఒక చక్కని అవగాహన కార్యక్రమం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడిందన్నారు. డాక్టర్ బ్రజ రాజ్ మిశ్రా, డాక్టర్ సందీప్ ల నిర్వహణలో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు.
చిత్రలేఖనం వక్తృత్వ పోటీలతో ఏకాగ్రత సాధ్యం
అనంతపురం జిల్లా
-హెచ్ఎం సాంబశివుడు
విశాలాంధ్ర-రాప్తాడు : చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలతో విద్యార్థుల్లో ఏకాగ్రత సాధ్యమని హెచ్ఎం సాంబశివుడు తెలిపారు. 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా లైబ్రేరియన్ వీరనారాయణరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం రాప్తాడు హై స్కూల్ విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్, క్రీడా పోటీలు నిర్వహించారు. హెచ్ఎం మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే వివిధ రకాల పోటీల్లో పాల్గొనడం వల్ల నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చన్నారు. ఉపాధ్యాయులు పి.రామాంజినేయులు, శ్రీహరి, బి.సాయిప్రసాద్, పి.లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

