Thursday, December 12, 2024
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిచట్ట పరిధిలోనే జీవించాలి...

చట్ట పరిధిలోనే జీవించాలి…

రూరల్ ఎస్సై శ్రీనివాసులు
విశాలాంధ్ర -ధర్మవరం: చట్ట పరిధిలోనే గ్రామ ప్రజలు జీవించాలని, చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకున్నప్పుడే మంచి జీవితం లభిస్తుందని రూరల్ ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా వారు జిల్లా ఎస్పీ, డి.ఎస్.పి, రూరల్ సీఐ ఆదేశాల మేరకు ప్రతిరోజు ఓ గ్రామంలో గ్రామ సభను నిర్వహించి, చట్టాలపై అవగాహన నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే మండల పరిధిలోని సీతారాంపల్లి గ్రామంలో గ్రామ సభను ఏర్పాటు చేశారు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ గొడవలకు దూరంగా ఉండాలని, ఏదైనా సమస్య ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, పేకాటకు దూరంగా ఉండాలని, మద్యానికి బానిస కాకూడదని వారు తెలిపారు. తదుపరి సైబర్ క్రైమ్ పైన రోడ్డు సేఫ్టీ పైన కూడా అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. చిన్నచిన్న గొడవలకు పోరాదని, పోలీస్ స్టేషన్లు చుట్టూ కోర్టులు చుట్టూ తిరిగితే సమయం వృధా అవుతుందని, సమన్వయంతో ఆలోచనతో నిర్వహిస్తే అంతా సుఖప్రదం అవుతుందని తెలిపారు. అంతేకాకుండా నాటు సారా కాచడం, అసాంఘిక కార్యకలాపాలు చేస్తే చట్ట పరంగా కఠిన చర్యలతో పాటు కేసులు నమోదు చేస్తామని వారు హెచ్చరించారు. బాల్య వివాహాలు చేయరాదని, బాలికలు ఉన్నత స్థాయి వరకు చదివించే ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తుందని, ప్రభుత్వ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. గ్రామాల్లో కొత్త వ్యక్తులు వస్తే నిగా ఉంచి మా పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని తెలిపారు. గ్రామ ప్రజలందరూ సమన్వయంతో ఐక్యమత్యంతో మెలిగినప్పుడే గ్రామ అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ పోలీసులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు