Homeజిల్లాలుఅనంతపురంబుక్కరాయసముద్రం సీపీఐ మైనారిటీ వింగ్ "ఇన్సాఫ్" నూతన కమిటీ ఎంపిక

బుక్కరాయసముద్రం సీపీఐ మైనారిటీ వింగ్ “ఇన్సాఫ్” నూతన కమిటీ ఎంపిక

- Advertisement -

విశాలాంధ్ర- అనంతపురం : బుక్కరాయసముద్రం సీపీఐ మైనారిటీ వింగ్ “ఇన్సాఫ్” నూతన కమిటీ ఎంపిక చేసినట్లు మండల కార్యదర్శి మర్రిస్వామి పేర్కొన్నారు. శనివారం స్థానిక సిపిఐ జిల్లా కార్యాలయం లో బుక్కరాయ సముద్రం మండల కార్యదర్శి మర్రి స్వామి నాయకత్వంలో సీపీఐ మైనారిటీ వింగ్ “ఇన్సాఫ్” నూతన . కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఇన్సాఫ్ నగర ఉపాధ్యక్షులు అల్లి పీరా, నగర అధ్యక్షులు చాంద్ బాషా , నగర ప్రధాన కార్యదర్శి ఖాజా హుస్సేన్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షా కార్యదర్శులు మాట్లాడుతూ… మైనారిటీలకు , అధికారంలో వచ్చే ప్రతి ఒక ప్రభుత్వం ఓటు బ్యాంకు లాగా ఉపయోగించుకుంటున్నారన్నారు. మైనారిటీలలో ఎంతో మంది దారిద్య్ర రేఖ దిగువలో ఉన్నారు , వారి బాగు కోసం ప్రభుత్వాలు దృష్టి సారించే విధంగా కృషి చేయాలని కోరారు . త్వరలోనే ప్రణాళిక బద్దంగా కార్యక్రమాలు చేపడుతామని అన్నారు.. మండల కార్యదర్శి మర్రి స్వామి మాట్లాడుతూ… మైనారిటీ వింగ్ ఇన్సాఫ్ కమిటీ ఏర్పాటు చేయటం వలన బుక్కరాయ సముద్రం లోని మైనారిటీలకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. తన సహాయ సహకారాలు ఎల్లపుడూ ఉంటుందన్నారు.
బుక్కరాయ సముద్రం సి పి ఐ మైనారిటీ వింగ్ “ఇన్సాఫ్” అధ్యక్షులు గా బాబా ఫకృద్దిన్, ప్రధాన కార్యదర్శి గా ఖలీల్ , ఉపాధ్యక్షులు గా మైనుద్దీన్ ను ఎన్నుకున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు