Homeజిల్లాలుఅనంతపురంచెరువులకు నీరు అందించేందుకు కాలువ పనులు పూర్తి చేయాలి..

చెరువులకు నీరు అందించేందుకు కాలువ పనులు పూర్తి చేయాలి..

- Advertisement -

ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కు సిపిఐ నేతలు డి.జగదీష్,పి.హరినాథ్ రెడ్డి ల వినతి..

విశాలాంధ్ర–గుంతకల్లు: అనంతపురం జిల్లా గుంతకల్–ఉరవకొండ నియోజకవర్గ పరిధిలోని చెరువులకు సాగునీరు అందించేందుకు పెండింగ్‌లో ఉన్న కాలువ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి. జగదీష్, పి. హరినాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం అమరావతిలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారికి వారు వినతిపత్రం సమర్పించారు. రాగలపాడు మైనర్ కాలువ (మెయిన్ కెనాల్) నుంచి ఉపకాలువ నిర్మాణానికి దాదాపు తొమ్మిది సంవత్సరాల క్రితమే అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలనా అనుమతి మంజూరు చేసిందని తెలిపారు. తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కాలువ పనులకు ఆర్థిక అనుమతి ఇచ్చి టెండర్లు పిలిచి, కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించినప్పటికీ, నిధుల విడుదల జరగకపోవడంతో భూ సేకరణ పూర్తికాలేదని, దాంతో పనులు ప్రారంభం కాలేదని వివరించారు.ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉరవకొండ నియోజకవర్గంలోని ఛాయపురం గ్రామం సందర్శించిన సందర్భంగా రైతులు, అలాగే గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ ఈ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లారని గుర్తు చేశారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించి అవసరమైన నిధులు మంజూరు చేసి పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఉరవకొండ నియోజకవర్గ ఎమ్మెల్యేగా, జిల్లా మంత్రిగా, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యత వహిస్తున్న మీరు రాబోయే బడ్జెట్‌లో ఈ కాలువ నిర్మాణం, భూ సేకరణకు తగిన నిధులు కేటాయించాలని వారు కోరారు. ఈ కాలువ పూర్తి అయితే ప్రాంతంలో వేల ఎకరాల వ్యవసాయ భూమికి సాగునీరు అందుతుందని, రైతులకు మేలు జరుగుతుందని సిపిఐ నాయకులు పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు