విశాలాంధ్ర-బ్యూరో అనంతపురం: తెలంగాణ తరహాలో జనగణన లో కులగణన శాస్త్రీయంగా తక్షణమే చేపట్టాలని అనంతపురము సీపీఐ జిల్లా కార్యవర్గ సమావేశం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండు చేసింది. గురువారం సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి చిరుతల మల్లికార్జున అధ్యక్షతన నీలం రాజశేఖరరెడ్డి భవనంలో జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి పాళ్యము నారాయణస్వామి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తరహాలో జనగణనలో కులగణన చేపట్టాలని అందుకు సంబంధించి కూటమి ప్రభుత్వంపై రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ఒత్తిడి పెంచాలన్నారు. కలిసివచ్చే రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలతో ఈ నెల 27న జిల్లా స్థాయిలో ఎన్ జి హోం లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ప్రజాఉద్యమాన్ని చేపడతామని నారాయణస్వామి పేర్కొన్నారు. రౌండ్ టేబుల్ సమావేశానికి రాజకీయ పార్టీల ప్రతినిధులు ,ప్రజా సంఘాలు, కుల సంఘాల ప్రతినిధులు హాజరై కులగణన సాధించేవరకు ఉద్యమాన్ని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడానికి సలహలు సూచనలు ఇవ్వాలన్నారు. అర్డీటీ సంస్థకు కేంద్రం ఎఫ్ సి ఆర్ఏను తక్షణమే పునరుద్దరించాలని నారాయణస్వామి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. ఈ కార్యవర్గ సమావేశంలో సిపిఐ జిల్లాదర్శి కార్యవర్గ సభ్యులు కేశవరెడ్డి, శ్రీరాములు, గోపాల్, జిల్లా కార్యవర్గ సభ్యులు లింగమయ్య, రమణయ్య,రాజేష్ గౌడ్,జె. మల్లికార్జున, సంతోష్ కుమార్,కుళ్ళాయిస్వామి, చిన్నప్ప యాదవ్, పెద్దయ్య,పార్వతీ ప్రసాద్ లు పాల్గొన్నారు.


