Homeజిల్లాలుఅనంతపురంస్థానిక అవసరాలకు మాత్రమే ఇసుక రవాణా.. ఎస్సై గురు ప్రసాద్ రెడ్డి

స్థానిక అవసరాలకు మాత్రమే ఇసుక రవాణా.. ఎస్సై గురు ప్రసాద్ రెడ్డి

- Advertisement -

విశాలాంధ్ర……డీ హి రే హల్.. స్తానిక అవసరాలకు మాత్రమె ఉచితంగా ఇసుక రవాణా చేసుకోవాలని ఎస్ఐ గురుప్రసాడు రెడ్డి అన్నారు . రాష్ట్ర ప్రభుత్వం ప్రజల స్థానిక అవసరాలకు ఇసుకను ఉచితంగా తీసుకోవచ్చని ఆదేశాలు జారీ చేసిందని వారు తెలిపారు. కేవలం రవాణా ఛార్జీలు, లోడింగ్ ఛార్జీలు తప్ప ఇసుక కు డబ్బు కట్టనవసరం లేదన్నారు. ఇతర రాష్ట్రాలకు ఇసుకను తరలించడం,ఇసుకను అవసరం లేకుండా డంప్ చేయడం కూడా నేరమన్నారు. రాయదుర్గం రూరల్ సర్కిల్ పరిధిలో ఉన్న కణేకల్, బొమ్మనహల్, డి హిరేహాల్ మరియు గుమ్మగట్ట మండలాల్లో ఇసుక దొంగ రవాణా సంబంధించి సమాచారాన్ని ఆయా మండల పోలీస్ స్టేషన్ SI లకు లేదా 100 నంబరు కాల్ చేయాలన్నారు.

గురువారం అన్ని మండలాల్లో SI లు వారి పరిధిలోని ఇసుక లభ్యత గల ప్రదేశాలు, రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో సిబ్బందితో కలసి తనిఖీలు చేశారు అలాగే గతం లో ఇసుక అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డ వారికి కూడా స్టేషన్ కి పిలిపించి కౌన్సెలింగ్ చేయడం జరుగుతుందని, అలాంటి వారిని తహసీల్దార్ ఎదుట హాజరు పరచి బౌండ్ ఓవర్ కేసులు పెడుతామని వారు హెచ్చరించారు
ఇసుక ట్రాక్టర్ లు స్థానిక అవసరాల కోసం లోకల్ గా తిరిగేటప్పుడు పోలీసులు కేవలం డ్రైవర్ లైసెన్స్, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, ఓవర్ లోడ్ మరియు సేఫ్టీ మెజర్స్ తీసుకోకుండా తిరిగేటప్పుడు మాత్రమే పట్టుకొని మోటారు వాహనాల చట్టం ప్రకారం జరిమానా వేస్తారని తెలిపారు.
రాష్ట్ర సరిహద్దులలో ఇసుక దొంగ రవాణా ట్రాక్టర్ ను పట్టుకుంటే సీజ్ చేసి క్రిమినల్ కేసు నమోదు చేస్తామని ఎస్ఐ గురు ప్రసాద్ రెడ్డి తెలిపారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు