Friday, February 28, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిచెస్ టోర్నమెంట్ కరపత్రాలు విడుదల

చెస్ టోర్నమెంట్ కరపత్రాలు విడుదల

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని కొత్తపేట-రామ్ నగర్ లో గల శ్రీ ఉషోదయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ఫిబ్రవరి 8వ, తొమ్మిదవ తేదీలలో రెండు రోజులపాటు ఏడవ స్టేట్ లెవెల్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ యొక్క కరపత్రాలను ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎంఈఓ గోపాల్ నాయక్ తో పాటు యువర్ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ కమిటీ వారు పట్టణంలోని మెయిన్ బజార్లో గల స్వాతి క్లినిక్ లో విడుదల చేశారు. ఈ సందర్భంగా యువర్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర, కార్యదర్శి జయరాం, కోశాధికారి వంకదారు మోహన, ఉపాధ్యక్షులు కుమార్, ఆర్గనైజింగ్ కార్యదర్శి జాకీర్ హుస్సేన్ మాట్లాడుతూ ఆసక్తి గల క్రీడాకారులు సెల్ నెంబర్ 9912647372 కు గాని ల్యాండ్ నెంబర్ 08559 -221813కి గాని సంప్రదించవచ్చునని తెలిపారు. చెస్లో పాల్గొనేవారు ప్రవేశరుసు 600 రూపాయలు ఉంటుందని తెలిపారు. మొత్తము ప్రైజులు 60 వేల రూపాయలు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలా ప్రభాకర్, చాంద్ బాషా, రాధాకృష్ణ ,రమేష్ బాబు, బండ్లపల్లి రంగనాథ్, డాక్టర్ . సుబ్బారావు, వై కే శ్రీనివాసులు, బండి నాగేంద్ర, కలీల్, మల్లికార్జున, వినోద్ కుమార్, సికిందర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు