Homeఆంధ్రప్రదేశ్ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ

- Advertisement -


విశాలాంధ్ర – రాజానగరం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబందించి మండలంలోని వివిధ గ్రామాల లబ్ధిదారులకు జనసేన పార్టీ నా సేన నా వంతు కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి చేతులు మీదుగా లబ్ధిదారులకు మంగళవారం చెక్కులు పంపిణీ చేశారు. మండలంలోని వివిధ అనారోగ్య కారణాలతో చికిత్స పొందిన 31 మంది లబ్ధిదారులకు సుమారు రు:20 లక్షలకు చెందిన చెక్కులను అందజేశారు. మండలం లోని ముక్కినాడ,జి.యర్రంపాలెం,తోకాడ,పుణ్యక్షేత్రం, లాలా చెరువు,భూపాలపట్నం,కానవరం,పాత తుంగ పాడు,దివాన్ చెరువు,వెలుగుబంధ,తూర్పు గాను గూడెం, శ్రీకృష్ణపట్నం, పల్లకడియం, కలవచర్ల,నరేంద్ర పురం,రాధేయపాలెం,మలంపూడి గ్రామాలకు చెందిన 31 మంది లబ్ధిదారులకు సంబంధించి రు: 20,10,305/- చెక్కులను అందజేశారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ వివిధ అనారోగ్య కారణాలతో చికిత్సల అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల కోసం రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామ కృష్ణ సిఫారసు మేరకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందిస్తున్నట్లు చెప్పారు.దీనిలో భాగంగా మండలం లోని పై గ్రామాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను అందజేయడం జరిగిందనీ తెలిపారు.ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు