Homeఆంధ్రప్రదేశ్సివిల్స్‌ తుది ఫలితాలు విడుదల.. టాప్‌-10 ర్యాంకర్లు వీరే..

సివిల్స్‌ తుది ఫలితాలు విడుదల.. టాప్‌-10 ర్యాంకర్లు వీరే..

- Advertisement -

అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ  (UPSC) నిర్వహించిన సివిల్స్‌ (మెయిన్‌) – 2025 తుది ఫలితాలు(UPSC Civils 2025 final Results) విడుదలయ్యాయి. యూపీఎస్సీ (UPSC) అధికారులు శుక్రవారం మధ్యాహ్నం ఈ ఫలితాలను విడుదల చేశారు.(UPSC Civils Final result 2025). మొత్తంగా 958 మందిని వివిధ సర్వీసులకు ఎంపిక చేయగా.. జనరల్‌ కేటగిరీ నుంచి 317 మంది, ఈడబ్ల్యూఎస్‌ నుంచి 104, ఓబీసీ నుంచి 306, ఎస్సీ కేటగిరీ నుంచి 158, ఎస్టీ కేటగిరీ నుంచి 73 మంది చొప్పున ఎంపికయ్యారు. ఈ ఫలితాల్లో అనూజ్‌ అగ్నిహోత్రి జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించి సత్తా చాటగా.. పలువురు తెలుగు విద్యార్థులు సివిల్స్‌లో సత్తా చాటారు.

టాప్‌ 10 ర్యాంకర్లు వీరే..
అనూజ్‌ అగ్నిహోత్రి
రాజేశ్వరి సువే
అకాన్ష్‌ ధుల్‌
రాఘవ్‌ ఝున్‌ఝున్‌వాలా
ఇషాన్‌ భట్నాగర్‌
జినియా అరోడా
ఏఆర్‌ రజా మొహియిద్దీన్‌
పక్షల్‌ సెక్రటరీ
అస్థా జైన్‌
ఉజ్వల్‌ ప్రియాంక్‌

సత్తా చాటిన తెలుగు విద్యార్థులు..
సివిల్స్‌ ఫలితాల్లో పలువురు తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. జాతీయ స్థాయిలో సృజన 55వ ర్యాంకు సాధించ‌గా.. డీఎస్‌కే ప్రచేత్‌ 193వ ర్యాంకు, ఎస్‌ వర్షిత్‌ రెడ్డి 259, ఎం.పవన్‌కుమార్ రెడ్డి 297, వెలిమినేటి విక్రమసింహారెడ్డి 541, గుమ్మల శ్వేత 573, పల్లి ప్రమోద్‌ విష్ణు 640, గుమ్మల విజయసింహారెడ్డి 682, పోతుపురెడ్డి భార్గవ్‌ 738, పుడారి రాహుల్‌ 748, కుమ్మరి శ్రవణ్‌కుమార్‌ 768, అనిరుధ్‌ కత్తిమాని 786, కోరపోతుల శ్రీకర్‌రాజు 806, ఇస్లావత్‌ శ్రీరామ్‌ హర్ష 823, కట్టా ప్రత్యూష 908, గోగుల రాజశేఖర్‌ 920, గుగులోతు జితేందర్‌ నాయక్‌ 939వ ర్యాంకులతో ప్రతిభ చాటారు.

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ వంటి పోస్టుల భర్తీకి యూపీఎస్సీ గతంలో నోటిఫికేషన్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా గతేడాది మే 25న జరిగిన ప్రిలిమ్స్‌లో సత్తా చాటిన వారికి ఆగస్టు 22 నుంచి 31 వరకు మెయిన్‌ పరీక్ష(UPSC CSE Main Exam) నిర్వహించిన విషయం తెలిసిందే. మెయిన్స్‌లో అసాధారణ ప్రతిభను చాటిన వారికి గతేడాది డిసెంబర్‌ నుంచి 2026 ఫిబ్రవరి వరకు దశల వారీగా ఇంటర్వ్యూలను నిర్వహించి తాజాగా తుది ఫలితాలను ప్రకటించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు