Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరమును సద్వినియోగం చేసుకోండి..

ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరమును సద్వినియోగం చేసుకోండి..

- Advertisement -

రోటరీ క్లబ్ అధ్యక్షులు నాగభూషణ
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా గల కోటా స్కూల్ నందు మార్చి 8వ తేదీ ఆదివారం ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉచిత కంటి ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు రోటరీ క్లబ్ అధ్యక్షులు నాగభూషణ, కార్యదర్శి విజయభాస్కర్,కోశాధికారి నరేందర్ రెడ్డి, క్యాంపు చైర్మన్ రామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సాంస్కృతిక మండలి లో రోటరీ క్లబ్ కమిటీ వారు కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా కంటి ఆపరేషన్ల వైద్య శిబిరంతో పాటు, ఉచిత ఆపరేషన్లు, ఉచిత వసతి, ఉచితంగా కంటి అద్దాలను కూడా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. దాతల సహాయ సహకారంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆదివారం జరగబోయే ఉచిత కంటి వైద్య శిబిరానికి దాతలుగా మేడాపురం వాస్తవులు కీర్తిశేషులు జోగన్న గారి తిప్పన్న కుమారుడు, కీర్తిశేషులు జోగన్న గారి శ్రీరాములు ఉభయుల జ్ఞాపకార్థం లక్ష్మయ్య వారి కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇప్పటివరకు పట్టణ గ్రామీణ ప్రాంతాలలో గల పేద ప్రజలకు వేల సంఖ్యలో కంటి ఆపరేషన్లు అద్దాలను కూడా ఉచితంగా ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ శిబిరానికి వచ్చేవారు ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్, రేషన్ కార్డు లేదా ఓటర్ గుర్తింపు కార్డు ఏవైనా రెండు జిరాక్స్ కాపీలు మూడు ఫోటోలు చిరునామాతో రావాలని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని పట్టణము గ్రామీణ ప్రాంతాలలో గల పేద ప్రజలు సద్వినియోగం చేసుకొని కంటి వెలుగును ప్రసాదించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక మండలి అధ్యక్షులు ప్రసన్నకుమార్ తో పాటు రామకృష్ణ, సుదర్శన్ గుప్తా, రత్న శేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు