Homeజిల్లాలుశ్రీ సత్యసాయిసత్య సాయి జిల్లా ఏపీ జేఏసీ వైస్ చైర్మన్ గా ఆర్ రామకృష్ణ నాయక్ ఎన్నిక

సత్య సాయి జిల్లా ఏపీ జేఏసీ వైస్ చైర్మన్ గా ఆర్ రామకృష్ణ నాయక్ ఎన్నిక

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;;శ్రీ సత్య సాయి జిల్లాలోని అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో కూడిన ఆంధ్రప్రదేశ్ జాయింట్ యాక్షన్ కమిటీ శ్రీ సత్యసాయి జిల్లా వైస్ చైర్మన్ గా ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ రామకృష్ణ నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి జిల్లా అధ్యక్షులు డి. శ్రీనివాసులు తెలియజేశారు. అనంతరం రామకృష్ణ నాయక్ మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పట్ల రాజీలేని పోరాటాల కొనసాగిస్తానని తెలిపారు.
రామకృష్ణ నాయక్ ఎంపిక పట్ల యుటిఎఫ్ జిల్లా కమిటీ సభ్యులతో పాటు ధర్మవరం జోన్ యుటిఎఫ్ నాయకులు ఆంజనేయులు, అమర్ నారాయణరెడ్డి, మేరీ వర కుమారి, నాగేంద్రమ్మ, జింక హరికృష్ణ ,హెచ్ రామాంజనేయులు, రాంప్రసాద్, లక్ష్మయ్య, సకల చంద్రశేఖర్ ,సురేష్ తదితరులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు