Homeజిల్లాలుశ్రీ సత్యసాయిషిరిడి సాయిబాబా సేవాసమితి కమిటీకి విరాళం

షిరిడి సాయిబాబా సేవాసమితి కమిటీకి విరాళం

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని పుట్టపర్తి రోడ్, సాయి నగర్ లో గల సాయిబాబా దేవాలయంలో శివుని ఆలయంలో శివలింగం, పార్వతి దేవి నిత్యం పూజలు కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా అర్చకులు నడుమ నిర్వహిస్తున్నారు. ఈ ఆలయం కట్టి కొన్ని నెలలు గడవడంతో భక్తాదులు బాబా విగ్రహం తో పాటు శివునికి కూడా విశేష పూజలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నాగేశ్వర్ రెడ్డి, భార్య సౌభాగ్య ధర్మారం వాసులు శివాలయంలోని పార్వతీదేవికి మంగళసూత్రాలు కు గాను 45 వేల రూపాయలు విరాళాన్ని కమిటీ వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు వీరనారాయణ, ఉపాధ్యక్షులు నారాయణరెడ్డి, కార్యదర్శి రామలింగయ్య, ఉప కార్యదర్శి జే సి నాయుడు, కోశాధికారి సూర్యనారాయణ, సూర్య ప్రకాసులు ఆ దంపతులకు కృతజ్ఞతలను తెలియజేస్తూ ఘనంగా సన్మానించారు. అనంతరం వారి పేరిటన అర్చనలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు