విశాలాంధ్ర ధర్మవరం;;పట్టణంలోని స్థానిక కాకతీయ విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు ఘనంగా సరస్వతి పూజ నిర్వహించారు 2026 మార్చ్ 16వ తేదీన పదవ తరగతి పరీక్షలు రాయబోవు విద్యార్థిని విద్యార్థులు అత్యంత భక్తి శ్రద్ధలతో గణపతి, సరస్వతి, లక్ష్మీ పూజ నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ నిర్మలాదేవి మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలు రాయబోవు విద్యార్థులు ఇష్టంతో కష్టపడి చదివితే తిరుగులేని విజయాలు సాధిస్తారని ఆ దిశగా విద్యార్థులు ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసి తల్లిదండ్రులకు, పాఠశాలకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని తెలియజేశారు. పరీక్ష సమయంలో చదువు తో పాటు ఆరోగ్యాన్ని కూడా తగు జాగ్రత్తగా చూసుకోవాలని తెలియజేశారు
ఈ కార్యక్రమంలో కస్పాండెంట్ నిర్మలాదేవి, డైరెక్టర్లు శెట్టిపీ సూర్య ప్రకాశ్ రెడ్డి ,శెట్టిపి పద్మ, శెట్టిపి జశ్వంత్ రెడ్డి, శెట్టిపి హర్జిత్ ప్రణవ్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం, పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
కాకతీయ విద్యానికేతన్ నందు ఘనంగా సరస్వతి పూజ
- Advertisement -
RELATED ARTICLES


