Homeతెలంగాణమూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు కోసం భూ సేకరణను వేగవంతం చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి

మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు కోసం భూ సేకరణను వేగవంతం చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి

- Advertisement -

మూసీ ప్రాజెక్టు ఫేజ్ 2పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. వీలైనంత త్వరగా టెండర్లు పిలవాలని సీఎం ఆదేశించారు. మూసీ ప్రాజెక్టుకు సంబంధించి భూ సేకరణను వేగవంతం చేయాలి అని సీఎం ఆదేశించారు. మంచిరేవుల ఓంకారేశ్వర ఆలయానికివెంటనే టెండర్లు పిలవాలని…కొత్వాల్ గూడ బర్డ్ పార్క్‌కు మరింత ప్రచారం కల్పించాలని సీఎం ఆదేశించారు.మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు కోసం అవసరమైన భూసేకరణను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భూసేకరణకు ల్యాండ్ పూలింగ్‌ విషయంలో స్పష్టమైన విధానం రూపొందించాలని చెప్పారు.మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టు ఫేజ్-2 కి వీలైనంత తొందరగా టెండర్లు పిలవాలని చెప్పారు. భూసేకరణ ప్రక్రియలో ఎఫ్‌టీఎల్, బఫర్‌ జోన్, అసైన్డ్ భూముల సేకరణకు స్పష్టమైన విధివిధానాలు రూపొందించాలని అన్నారు. ఇందులో న్యాయపరమైన ఎలాంటి చిక్కులు రాకుండా జాగ్రత్త వహించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

టీడీఆర్ పైన ప్రతి వారం సమీక్ష జరగాలి

మూసీ రివర్‌ఫ్రంట్‌లో భాగంగా చేపట్టే ప్రాజెక్టులకు అతి తక్కువ వడ్డీకి రుణ సదుపాయాలపై మున్సిపల్ కమిషనర్లు దృష్టి సారించాలని, అలాగే టీడీఆర్‌లు జారీ చేసే విషయంలో కూడా ప్రతి వారం సమీక్షించాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. గండిపేట మంచిరేవుల సమీపంలోని ఓంకారేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి తక్షణం టెండర్లు పిలవాలని ఆదేశించారు. అలాగే కొత్వాల్‌గూడ బర్డ్స్ పార్క్‌కు విస్తృత ప్రచారం కల్పించాలని చెప్పారు. ఈ సమావేశంలో సీఎం కార్యదర్శి మాణిక్ రాజ్ , HMDA కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, GHMC కమిషనర్ ఆర్.వి. కర్ణన్, మల్కాజ్‌గిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి, సైబరాబాద్ కమిషనర్ సృజన ,రంగా రెడ్డి జిల్లా నారాయణ రెడ్డి,మేడ్చల్‌ కలెక్టర్‌ మను చౌదరి, ఎంఆర్డీసీఎల్ ఎండీ ఈ.వి. నరసింహ రెడ్డి, ఎంఆర్డీసీఎల్ జేఎండీ గౌత‌మి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు