విశాలాంధ్ర- డుంబ్రిగుడ ( అల్లూరి జిల్లా): అరకులో ఈనెల 29న చలి ఉత్సవాలకు రానున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనను విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు ఆనంద్ రావు పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని కిడారి భవన్లో తెలుగుదేశం పార్టీ మండల నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో గల 18 పంచాయతీ గ్రామ కమిటీ, పంచాయితీ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీలు, ప్రజెంట్ నాయకులు, మండల నాయకులు, గ్రామ ఐక్య మహిళ సంఘాలు, యువతి యువకులు మండల ప్రజలు అందరూ అరకులోయ 29 గురువారంన జరగబోయే చలి ఉత్సవాలకు హాజరుకావాలని, చలి ఉత్సవంలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. ప్రతి పంచాయతీలకు బస్సులు కూడా ఏర్పాటు చేస్తున్నారని, టిడిపి పంచాయతీ నాయకులు బాధ్యత వహించి ప్రజలకు రాకపోక బాధ్యతలు తీసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి డైరెక్టర్ సుబ్బారావు, తెలుగుదేశం పార్టీ అరకు నియోజకవర్గ ప్రతినిధి గె న్ను, అరకు పార్లమెంట్ టి యు టి యు సి ప్రధాన కార్యదర్శి స్వామి, పిఎసిఎస్ బ్యాంక్ చైర్మన్ సుబ్బారావు, అరకు మాజీ సర్పంచ్ వెంకట్రావు, సూపర్ ఎంపీటీసీ సింహాద్రి,పోతంగి పంచాయితీ అధ్యక్షులు భీమరాజు, బొంజి బాబు, రవి, తదితరులు పాల్గొన్నారు.
సీఎం పర్యటన విజయవంతం చేయాలి..
- Advertisement -
RELATED ARTICLES


