Homeజిల్లాలుశ్రీ సత్యసాయిజాతీయ అవార్డు అందుకున్న డిజైనర్ జూజారే నాగరాజు..

జాతీయ అవార్డు అందుకున్న డిజైనర్ జూజారే నాగరాజు..

- Advertisement -

విశాలాంధ్ర -ధర్మవరం : దేశ రాజధాని న్యూఢిల్లీలో భారత్ మండపం వద్ద జరిగిన 11 వ చేనేత దినోత్సవం కేంద్ర ప్రభుత్వం వారు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం వీక్షించుటకు దేశ నలుమూలల నుంచి కొన్ని వందల మంది చేనేత కార్మికులను, డిజైనర్లను అతిథులుగా ఆహ్వానించారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణంలో నివసిస్తున్న డిజైనర్, చేనేత కార్మికులు జూజారే నాగరాజుకు ఆహ్వానం అందింది. డిజైనర్ నాగరాజు చేనేత వృత్తిని చేస్తూ డిజైన్ నందు మంచి ప్రతిభను ఘనపరిస్తూ ఎన్నో అద్భుతాలను చేస్తూ గతంలో రాష్ట్రస్థాయి జాతీయ స్థాయి అవార్డులను కైవసం చేసుకున్నారు. వీరి పనితనాన్ని గుర్తించి ఆగస్టు ఏడవ తేదీ గురువారం ఢిల్లీలో జాతీయస్థాయి విభాగంలో చేనేత డిజైన్ డెవలప్మెంట్ అవార్డును అందించారు. కేంద్ర చేనేత అండ్ జోడీ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్, హిమాచల్ పార్లమెంట్ సభ్యులు కంగానా రనోత్, హ్యాండ్లూమ్ కమిషనర్ బీనా, ఇతర శాఖల మంత్రివర్యులు, అధికారుల ద్వారా ఈ అవార్డును జూజారే నాగరాజు అందుకున్న రూ. తదుపరి నాగరాజు మాట్లాడుతూ ఈ అవార్డు అందుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందని, ఆంధ్రప్రదేశ్కు చెందిన చేనేత కార్మికుల వారి సంతోషాన్ని మద్దతును తెలుపుతున్నారని వారు తెలిపారు. ఈ అవార్డు చేనేత కార్మికులకే అంకితం అని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు