విశాలాంధ్ర ధర్మవరం; రాష్ట్ర స్థాయిలో ఈ నెల 26 తేదీ నుండి 28 తేదీ వరకు విజయవాడ నగరంలో జరిగే 69 వ ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ అండర్ _19 ఇంటర్ డిస్టిక్స్ పోటీల్లో పాల్గొనే ఉమ్మడి అనంతపురం బాస్కెట్బాల్ బాల బాలికల జట్ల నందు బాలుర విభాగంలో ధర్మవరం పట్టణానికి చెందిన విజయ్ తరుణ్, సాయికుమార్, బాలికల విభాగంలో యశస్విని, అలేఖ్య ధర్మవరం పట్టణానికి చెందిన 4 మంది మంది బాస్కెట్బాల్ క్రీడాకారులు ఎంపిక కావడం గర్వకారణమని ఉమ్మడి అనంతపురం జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ అసోసియేట్ సెక్రటరీ శెట్టిపి జయ చంద్రా రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ అక్టోబర్ నెల నందు అనంతపురం నగరంలోని ఇండోర్ స్టేడియంలో జరిగిన సెలక్షన్స్ నందు వీరు ప్రతిభా చూపి ఉమ్మడి అనంతపురం జిల్లా జట్లకు ఎంపికయ్యారు అని తెలిపారు. వీరి ఎంపిక పట్ల , ఉమ్మడి జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ సెక్రెటరీ శెట్టిపి జయ చంద్రారెడ్డి తో పాటు ధర్మాంబా బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు మేడాపురం రామి రెడ్డి, కార్యదర్శి వాయల్పాడు హిదయ తుల్లా, కోచ్ సంజయ్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రస్థాయిలో స్థాయిలో వీరు రాణించి ధర్మవరం పట్టణమునకు పేరు ప్రతిష్టలు తేవాలని వారు ఆకాంక్షించారు. ఎంపికైన క్రీడాకారులు మంగళవారం రోజున బయలుదేరి విజయవాడ కి వెళ్లారు.
అండర్ _19 స్కూల్ గేమ్స్ కు ధర్మవరం బాల బాలికలు ఎంపిక
- Advertisement -
RELATED ARTICLES


