సీనియర్ సివిల్ జడ్జ్ వెంకటేశ్వర్లు
విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని సీనియర్ సివిల్ కోర్టులో, సీనియర్ సివిల్ జడ్జ్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మహిళలపై హింస నిర్మూలనకు అంతర్జాతీయ దినోత్సవం కార్యక్రమాన్ని వారు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళలపై జరుగుతున్న హింస వేధింపులు, విషయములో అనేక చట్టాలు ఉన్నాయని తద్వారా నేరం చేసిన వారు ఖచ్చితంగా శిక్షింపబడు దురు అని తెలిపారు. ప్రతి సంవత్సరం నవంబర్ 25న అంతర్జాతీయ మహిళలపై హింస నిర్మూలన దినోత్సవం జరుపుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ అమరావతి ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ దినోత్సవం లక్ష్యం మహిళలపై హింస అనేది మానవ హక్కుల ఉల్లంఘన అని అందరికీ అవగాహన కల్పించడం జరిగిందన్నారు. మహిళలు బాలికలపై జరిగే దాడులు లైంగిక వేధింపులు ఇంట్లో తదుపరి బయట జరుగుతున్న ప్రతి హింస చర్యను నివారించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జ్ హరీష్, న్యాయవాదులు బాలసుందరి, సుమలత తో పాటు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
ఘనంగా అంతర్జాతీయ మహిళ హింస నిర్మూలన దినోత్సవం
- Advertisement -
RELATED ARTICLES


