మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ నారాయణమూర్తి
విశాలాంధ్ర ధర్మవరం;; నైతిక విలువలతో కూడిన విద్య భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుందని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ నారాయణమూర్తి, అధ్యక్షులు జగ్గా వేణుగోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని కొత్తపేటలో గల మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నైతిక విలువలతో కూడిన విద్య అన్న అంశంపై వ్యాసరచన పోటీలను నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు వివిధ పోటీ అంశాల్లో పాల్గొన్నప్పుడే మంచి విలువలతో కూడిన విద్య లభిస్తుందని తెలిపారు. ఈ వ్యాసరచన పోటీలో 8వ, 9వ తరగతి విద్యార్థులు పాల్గొనగా అందులో ప్రతిభ ఘనపరిచిన వారిలో ఏం.నాగప్రనీత, ప్రధమ పి. కళ్యాణి, ద్వితీయ కె.ఉషశ్రీ తృతీయ బహుమతులను గెలుచుకోవడం జరిగిందని తెలిపారు. అనంతరం గెలుపొందిన విద్యార్థులకు మానవతా సంస్థ వారు సర్టిఫికెట్ జ్ఞాపికలతో సత్కరించారు. అనంతరం నైతిక విలువలతో కూడిన విద్య గూర్చి పాఠశాల హెడ్మాస్టర్ రాంప్రసాద్ వివరించారు. ఈ కార్యక్రమంలో మానవతా సంస్థ ఉపాధ్యక్షులు మంజునాథ్ డైరెక్టర్ రామకృష్ణ, మనోహర్ గుప్తా, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
నైతిక విలువలతో కూడిన విద్య భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది
- Advertisement -
RELATED ARTICLES


