విశాలాంధ్ర -ధర్మవరం;; అంతర్జాతీయ స్థాయి చెస్ టోర్నమెంటులో మెరిసిన బిఎస్కే ప్రొఫెషనల్ చెస్ అకాడమీ క్రీడాకారుడు 12 సంవత్సరాల చిన్నారి ఎంపీ. శ్రహూద్ బి ఎస్ కే హెచ్ ఎస్ అకాడమీ చీఫ్ ఫోర్స్ ఎస్. ఆదిరత్నకుమార్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ విజయవాడ లో ఈ నెల 22 నుండి 24 వరకు జరిగిన అంతర్జాతీయ చెస్ సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన ఎకోరిన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్ లో దాదాపుగా 265మంది అంతర్జాతీయ క్రీడాకారుల మొత్తం 595 క్రీడాకారులు పాల్గొన్నారు అని, ఈ టోర్నమెంట్లో ధర్మవరం లో గల బి ఎస్ కే ప్రొఫషనల్ చెస్ అకాడమీ క్రీడాకారుడైన ఎంపీ సహృద్
1800 బిలో రేటింగ్ టోర్నమెంట్లో 9రౌండ్లకు గాను 8రౌండ్స్ నెగ్గి ఛాంపియన్షిప్ టైటిల్ నెగ్గడం తో పాటు తన రేటింగులో 65 ఫైడ్ రేటింగ్ పాయింట్స్ ని మెరుగుపరుచు కొని 1775 చేరుకున్నాడు అని తెలిపారు. ఇందుకుగాను బి ఎస్ కే చెస్ అకాడమీ చీఫ్ కోచ్ S. ఆది రత్నకుమార్ (ఇంటర్నేషనల్ చెస్ కోచ్ బి ఎస్ కే చెస్ అకాడమీ ధర్మవరం ) మరియు అకాడమీ కోచ్ మరియు అకాడమీ చెస్ క్రీడాకారులు హర్షం వ్యక్తం చేసారు.
అంతర్జాతీయ స్థాయి చెస్ టోర్నమెంట్ లో మెరిసిన చిన్నారి సహృద్
- Advertisement -
RELATED ARTICLES


