ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తిపేంద్ర నాయక్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని రజిని ట్రస్ట్, రక్త బంధం ట్రస్ట్ సేవలు అమూల్యమైనవని ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తీపేంద్ర నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త బంధం రజనీ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి తిపేంద్ర నాయక్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ అన్నదానం బ్రహ్మస్వరూపమని, అన్ని దానాల కన్నా అన్నదాన ముఖ్యమని వారు తెలిపారు. దాదాపు 70 మందికి సూపర్డెంట్ చేతుల మీదుగా అల్పాహారాన్ని పంపిణీ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. అనంతరం వారికి కృతజ్ఞతలను తెలిపారు. తదుపరి రజనీ ట్రస్ట్, రక్త బంధం ట్రస్ట్ అధ్యక్షులు కన్నా వెంకటేష్ మాట్లాడుతూ నేటి ఈ సేవా కార్యక్రమం పట్టణానికి చెందిన చిప్పల చంద్రశేఖర్, అనిత, కుమారుడు చిప్పల యశ్వంత్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యుల సహకారంతో నిర్వహించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలుపుతూ, దాతకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కేతా లోకేష్, చంద్రశేఖర్ రెడ్డి, దాదు తదితరులు పాల్గొన్నారు.
రజనీ ట్రస్ట్, రక్త బంధం ట్రస్ట్ సేవలు అమూల్యమైనవి..
- Advertisement -
RELATED ARTICLES


