Homeజిల్లాలుశ్రీ సత్యసాయిధర్మవరం సీనియర్ సివిల్ జడ్జి బి కృష్ణవేణి పై వేటు..

ధర్మవరం సీనియర్ సివిల్ జడ్జి బి కృష్ణవేణి పై వేటు..

- Advertisement -

సర్వీస్ నుంచి తొలగించాలన్న హైకోర్టు ఆదేశాలు
విశాలాంధ్ర ధర్మవరం;; శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం సీనియర్ సివిల్ జిర్జి బి. కృష్ణవేణి (ప్రస్తుతం సస్పెండ్ లో ఉన్నారు) తొలగిస్తూ న్యాయశాఖ ఈనెల 24న ఉత్తర్వులను జారీ చేసింది. వీరు మూడు సంవత్సరాలుగా ధర్మారం కోర్టులో సీనియర్ సివిల్ జడ్జిగా ఉన్నప్పుడు ఎన్నో ఆరోపణల విషయంలో, అప్పటి జిల్లా జడ్జికి ఫిర్యాదులు పోయాయి. తీర్పులు రాయకపోవడం, ఉత్తర్వులపై సంతకాలు చేయడంలో విఫలం కావడం, సిబ్బందికి కొన్ని పనులు అప్పగించడం తదితర ఆరోపణలపై కృష్ణవేణి పై కలవు. అంతేకాకుండా ధర్మవరం బార్ అసోసియేషన్ జడ్జి కృష్ణవేణి పై కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మొత్తం 12 అభియోగాలు నమోదు కావడంతో విచారణ కొన్ని రుజువు కాగా మరికొన్ని నిరూపణ కాలేకపోయాయి. రుజువైన అభియోగాలు నిజమేనని విచారణ నివేదికలో పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ఆమెని సర్వీసు నుంచి తొలగించాలని సిపార్సి చేయడం జరిగింది. దీంతో జడ్జి కృష్ణవేణి తక్షణమే సర్వీసు నుంచి తొలగిస్తున్నట్లు న్యాయశాఖ కార్యదర్శి ఉత్తర్వులను జారీ చేశారు. అప్పట్లో న్యాయవాదులు ఫిర్యాదు చేసిన వాటికి నేడు కోర్టు ద్వారా న్యాయం జరిగిందని ధర్మవరం న్యాయవాదులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు