విశాలాంధ్ర-రాజాం ( విజయనగరం జిల్లా) : రాజాం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో ఆనందరావు, డెప్యూటీ ఎంపీడీవో శ్రీనివాసరావు ప్రథమంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.తరువాత సిబ్బందితో కలిసి రాజ్యాంగ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ నిలదొక్కుకోవడంలో రాజ్యాంగం కీలకపాత్ర పోషిస్తోందని, ప్రతి పౌరుడు దానిలో పొందుపరచిన హక్కులు, బాధ్యతలను తెలుసుకుని పాటించాల్సిన అవసరాన్ని వివరించారు.కార్యాలయంలోని మొత్తం సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని రాజ్యాంగ ప్రతిజ్ఞ చేశారు. ఇలాంటి కార్యక్రమాలు సిబ్బందిలో చట్టపరమైన చైతన్యాన్ని పెంపొందిస్తాయని అధికారులు పేర్కొన్నారు.


