విశాలాంధ్ర- రాజాం (విజయనగరం జిల్లా) : రాజాం మండలం కంచరాం గ్రామంలో ఉన్న సుజనా విద్యాలయం బుధవారం అగ్ని ప్రమాదాల నివారణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ఫైర్ శాఖ అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫైర్ స్టేషన్ అధికారి ఎస్‌ఎఫ్‌ఓ పైల అశోక్ కుమార్ విద్యార్థులకు ఎల్పీజీ గ్యాస్ వినియోగం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.గ్యాస్ లీకేజ్, సిలిండర్‌ను సురక్షితంగా హ్యాండిల్ చేయడం, రెగ్యులేటర్ వినియోగ విధానం వంటి అంశాలను ప్రాక్టికల్ డెమో ద్వారా విద్యార్థులకు చూపించారు. అదనంగా స్కూల్ బస్ సేఫ్టీపై కూడా అవగాహన కల్పిస్తూ — ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా బయటకు వచ్చే విధానం, ప్రమాద సమయంలో ప్రశాంతంగా ఉండటం వంటి సూచనలు చేశారు.విద్యార్థులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు విద్యార్థుల్లో భద్రతా చైతన్యం పెంపొందించడంలో కీలకమని ఆయన పేర్కొన్నారు.


