Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఈవీఎం గోడౌన్ తనిఖీ

ఈవీఎం గోడౌన్ తనిఖీ

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం:: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ధర్మవరం పట్టణంలోని మార్కెట్ యార్డులో గల ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోడౌన్ పరిసరాలను వారు పరిశీలించారు. అనంతరం భద్రత, గోడానికి వేసిన తాళాల సీజ్ విధానం తదితర వాటిని వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధుల నడుమ పరిశీలించారు. అనంతరం గోడౌన్ భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని, భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులకు సూచించారు. తిరిగి రాజకీయ ప్రతినిధుల సమక్షంలో గోడౌన్ సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ సూర్యనారాయణ రెడ్డి, తాసిల్దార్ సురేష్ బాబు, కమిషనర్ వెంకటరమణయ్య, రెవెన్యూ సిబ్బంది, వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు