Homeజిల్లాలుశ్రీ సత్యసాయిభారీ ఉపగ్రహం సక్సెస్ లో ధర్మవరంవాసి

భారీ ఉపగ్రహం సక్సెస్ లో ధర్మవరంవాసి

- Advertisement -

విశాలాంధ్ర -ధర్మవరం; ఇస్రో ఆధ్వర్యంలో ఆదివారం ప్రయోగించిన భారీ ఉపగ్రహం సక్సెస్ లో శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన ఇంజనీర్ అంబటి ప్రవీణ్ కుమార్ పాలుపంచుకున్నారు. వివరాల్లోకి వెళితే ధర్మవరం పట్టణానికి చెందిన అంబటి ప్రవీణ్ కుమార్ గత కొన్ని సంవత్సరాలుగా ఇస్రోలో ఇంజనీర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆదివారం తొలిసారిగా భారతదేశంలో అత్యంత బరువైన స్వదేశీ ఉపగ్రహం సక్సెస్ లో ప్రవీణ్ కుమార్ పాలుపంచుకున్నారు. భారీ ఉపగ్రహం నింగిలోకి వెళ్లి విజయవంతం కావడంతో తోటి ఉద్యోగులు సైతం ప్రవీణ్ కుమార్ అభినందించారు. దీంతో సోమవారం ధర్మవరం పట్టణానికి చెందిన ప్రవీణ్ కుమార్ స్నేహితులు, బంధువులు ప్రవీణ్ కుమార్ కు ఫోన్ చేసి అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వివిధ విభాగాల అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, ఆర్యవైశ్య సంఘం దాని అనుబంధ సంస్థల అసోసియేషన్ వారు కూడా శుభాభినందనలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు