Homeజిల్లాలుశ్రీ సత్యసాయివిద్యార్థులు జ్ఞానం వైపు అడుగు వేయాలి..

విద్యార్థులు జ్ఞానం వైపు అడుగు వేయాలి..

- Advertisement -

రామగిరి సీఐ. వల్లాల శ్రీధర్ రాజు
విశాలాంధ్ర- ధర్మవరం : విద్యార్థులు జ్ఞానం వైపు అడుగు వేయాలని గురువులు విజ్ఞాన సర్వస్వం అవ్వాలని రామగిరి సీఐ వల్లాల శ్రీధర్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని రుషి విద్యాలయంలో ఇన్వెస్టర్ సేర్మనీ వేడుకలు కార్యక్రమానికి వారు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. అనంతరం సిఐ చేతుల మీదుగా హౌస్ మాస్టర్స్, మిస్టర్న్, కెప్టెన్, వైస్ కెప్టెన్, హెడ్ బాయ్, హెడ్ గర్ల్స్ కు బ్యాడ్జీలు ,కండువాలను అందజేశారు. అనంతరం సీఐ మాట్లాడుతూ ఐక్యత, సోదర భావం, సంస్కృతిని కాపాడడం ఎంతో ముఖ్యమని తెలిపారు. అంతేకాకుండా మాట్లాడుతూ మాట్లాడుతూ విద్యార్థులకు ఉపాధ్యాయులకు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టడం అందరినీ ఆకట్టుకుంది. అనంతరం డీన్ భాస్కర్ రెడ్డి , ప్రిన్సిపాల్ కరణ్ స్వరూప సింగ్, సిపిఓ రవీంద్ర మాట్లాడుతూ ఎన్నికైన వారందరూ తమ విధులను బాధ్యతతో సక్రమంగా నిర్వర్తించాలని విద్యార్థులకు తెలియజేశారు. ఎన్నికలు ప్రజాస్వామ్యానికి నిదర్శనమని ఓటు ద్వారా మార్పు సాధ్యమవుతుందని తెలిపారు. విద్యార్థి దశ నుండే పిల్లలు రాజకీయ అవగాహన కలిగి సమ సమాజాన్ని స్థాపించేలా ప్రయత్నం చేయాలని తెలిపారు. ప్రతి విద్యార్థి ఒక జ్ఞాన సింధువు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఏఓ. రంగారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ కళ్యాణి, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు