విశాలాంధ్ర -ధర్మవరం ; పట్టణంలోని టూ టౌన్ ఎస్ఐ గా వెంకటరాముడు బాధ్యతలను స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఎస్ఐ శ్రీరాములు 6 నెలల కిందట పదవీ విరమణ పొందడంతో, అప్పటినుండి ఎస్ఐ పోస్ట్ అలాగే ఖాళీగా ఉండిపోయింది. దీంతో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో గల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న వెంకట రాముడును జిల్లా ఎస్పీ 2 టౌన్ ఎస్ఐ గా బదిలీ వేశారు. దీంతో వారు టూ టౌన్ ఎస్ఐ గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం సిఐతోపాటు సిబ్బంది కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎస్సై వెంకట్ రాముడు మాట్లాడుతూ శాంతి భద్రత కోసం నిరంతరం కృషి చేస్తానని, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘ ఉంచుతానని తెలిపారు. ప్రజలందరూ కూడా చట్టపరంగా జీవించాలని తెలిపారు. గొడవలకు దూరంగా ఉండాలని, కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకొని జీవితాన్ని గడపాలని తెలిపారు. టూ టౌన్ పరిధిలో ప్రజలకు ఏదైనా సమస్యలు వచ్చినచో నేరుగా పోలీస్ స్టేషన్కు రావచ్చునని వారు స్పష్టం చేశారు. టూ టౌన్ ఎస్ఐ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంకటరాముడును పలువురు నాయకులు, స్నేహితులు, బంధువులు, తోటి ఉద్యోగస్తులు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు.
టూ టౌన్ ఎస్ఐ గా వెంకటరాముడు
- Advertisement -
RELATED ARTICLES


