Sunday, November 16, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఆరోగ్య, పర్యావరణ పరిరక్షణ పై అవగాహన..

ఆరోగ్య, పర్యావరణ పరిరక్షణ పై అవగాహన..

- Advertisement -

గొట్లురుగ్రామం ప్రజలకు ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లచే ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం; కే.హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ధర్మవరం ,విద్యార్థులచే గొట్లూరు గ్రామంలో ఎన్.ఎస్.ఎస్. ప్రత్యేక శిబిర కార్యక్రమములో భాగంగా 6వ రోజు గ్రామప్రజలకు ఆరోగ్యం , పరిశుభ్రత , పర్యావరణ పరిరక్షణ పట్ల వాలంటీరులు ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించారు. గొట్లూరు గ్రామంలోని మెయిన్ రోడ్ దగ్గర ఉన్న ఆర్చ్ దగ్గర నుండి వేణుగోపాల స్వామి ఆలయం వరకూ పుర వీధుల గుండా ర్యాలీ నిర్వహించి, గ్రామంలో 50 మొక్కలను నాటి, ప్రజలకుమొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం యూనిట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. బి. గోపాల్ నాయక్ ఆధ్వర్యంలో విజయవంతం అయింది. ఈ కార్యక్రమంలో డా.ఎస్.షమీఉల్లా, యం.భువనేశ్వరి, జీ. ఆనంద్, గొట్లూరు ఆరోగ్య శాఖ నుండి
వై.అఖిల, బి. సుబ్బలక్ష్మి, సి. లక్ష్మీ కాంతమ్మ , సచివాలయం నుండి పి . గణేష్ కుమార్ పంచాయతీ సెక్రెటరీ,జీ. మంజునాథ్ ,డిజిటల్ అసిస్టెంట్, ఓ. పద్మావతి,వెల్పేర్ అసిస్టెంట్, చంద్రన్న ఇంజనీరింగ్ అసిస్టెంట్ తదితర సిబ్బంది తో పాటు ఎన్.ఎస్.ఎస్. వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు