Sunday, November 16, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఉమ్మడి జిల్లా సిఐటియు ట్రాన్స్పోర్ట్ రంగం అధ్యక్షులు సయ్యద్ హైదర్ వలీ మృతి..

ఉమ్మడి జిల్లా సిఐటియు ట్రాన్స్పోర్ట్ రంగం అధ్యక్షులు సయ్యద్ హైదర్ వలీ మృతి..

- Advertisement -

సిపిఎం నాయకులు సంతాపం
విశాలాంధ్ర ధర్మవరం;; ఉమ్మడి జిల్లా సిఐటియు ట్రాన్స్పోర్ట్ రంగం అధ్యక్షులు సయ్యద్ హైదర్ వలీ తిరుపతిలోని రుయా ఆసుపత్రి నందు నవంబర్ మూడవ తేదీ సోమవారం చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ గత ఆరు రోజులకు క్రితం ప్రమాదానికి గురి అయ్యి తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం మృతి చెందారని తెలిపారు. గత 15 సంవత్సరాలుగా సిపిఎం పార్టీకి, సిఐటియుకి వివిధ సేవలను అందించాడని, వీరి మృతి పార్టీకి తీరని లోటు అని దిగ్భాంతిని వ్యక్తం చేస్తూ సంతాపంతో నివాళులను అర్పించారు. వీరి అంత్యక్రియలు మంగళవారం నిర్వహించబడుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు