Saturday, November 15, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఉచిత మెడికల్ విద్యని,వైద్యాన్ని పేదలకు దూరం చేస్తున్న కూటమి ప్రభుత్వం

ఉచిత మెడికల్ విద్యని,వైద్యాన్ని పేదలకు దూరం చేస్తున్న కూటమి ప్రభుత్వం

- Advertisement -

వైయస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి వేముల అమరనాథ్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం; వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ధర్మవరం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కేతిరెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి నిరసనగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంకి మద్దతుగా వైయస్సార్ విద్యార్ధి విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి వేముల అమరనాథ్ రెడ్డి,వై.యస్. ఆర్ విద్యార్ధి విభాగం సత్యసాయి జిల్లా అధ్యక్షులు పురుషోత్తం రాయల్ పలు కళాశాలల్లో విద్యార్థులు పిపిపి విధానానికి వ్యతిరేకంగా సంతకాలు చేసి మద్దతు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కుట్రలతో పేదలకు వైద్య విద్యను,వైద్యాన్ని దూరం చేయాలని ప్రైవేట్ వారికి కట్టబెడుతున్న పద్ధతి రాష్ట్రములో ఏర్పడిందని తెలిపారు. ఈ విషయాన్ని విద్యార్థులు మీ కుటుంబానికి సమాజానికి తెలియజేయాలని ఉద్యమానికి మద్దతుగా నిలవాలని, కూటమి ప్రభుత్వం దిగి వచ్చేవరకు విద్యార్థి ఉద్యమాలు బలంగా చేయాలని వారు పిలుపునిచ్చారు. అలాగే కూటమి ప్రభుత్వం పిపిపి విధానాన్ని రద్దు చేసుకోవాలని లేనిచో ప్రజా ఉద్యమంలో కూటమి ప్రభుత్వం కనుమరుగైపోతుందని ప్రభుత్వానికి వారు హితవు పలికారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు