Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఅర్ధరాత్రి జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీలు

అర్ధరాత్రి జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీలు

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;;శ్రీ సత్యసాయి జిల్లాలో శాంతిభద్రతలను మరింత పటిష్టం చేయడంతో పాటు, రాత్రివేళల్లో నేరాలను నివారించే ఉద్దేశంతో జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ గారు సోమవారం అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా వారు కొత్తచెరువు, ధర్మవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లను సందర్శించి విధుల్లో ఉన్న సిబ్బంది పనితీరు, నైట్ బీట్, పెట్రోలింగ్, వైర్లెస్ కమ్యూనికేషన్ అత్యవసర పరిస్థితుల్లో స్పందించే విధానాన్ని సమీక్షించారు.అనంతరం ధర్మవరం కాలేజీ సర్కిల్, ప్రధాన రహదారులు, బీట్ పాయింట్లు ఇతర ముఖ్య ప్రాంతాల్లో స్వయంగా పర్యటించి పోలీసుల గస్తీ, పెట్రోలింగ్ వాహనాల కదలికలను పరిశీలించారు. రాత్రివేళల్లో సంచరిస్తున్న వ్యక్తులు, వాహనాల వివరాలను తెలుసుకుని, అనుమానాస్పద కదలికలపై పోలీసులు కొనసాగిస్తున్న నిఘాను క్షేత్రస్థాయిలో సమీక్షించారు. అనంతరం ఎస్పీ నైట్ పెట్రోలింగ్‌పై ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు.
అత్యవసర కాల్స్, సంఘటనలపై వేగంగా స్పందించేలా సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని వారు స్పష్టం చేశారు.ఈ తనిఖీల్లో పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు