Homeజిల్లాలుశ్రీ సత్యసాయినేతన్న సేవ పథకంలో సచివాలయంలో జరిగిన అవకతలపై నిగ్గు తేల్చాలి..

నేతన్న సేవ పథకంలో సచివాలయంలో జరిగిన అవకతలపై నిగ్గు తేల్చాలి..

- Advertisement -

ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటనారాయణ
విశాలాంధ్ర ధర్మవరం;;నేతన్న సేవ పథకం లో జరిగిన అవినీతి అక్రమాల పై నిగ్గు తెల్చాలి అని నిరసిస్తూ ధర్మవరం పట్టణం లో ఆర్డీవో ఆఫీస్ నందు చేనేత కార్మిక సంఘం నాయకులు ఆర్డీవో కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటనారాయణ మాట్లాడుతూ తాము ఇచ్చిన వినతి పత్రం మేరకు ఆర్డిఓ స్పందించి ,ఎవరైతే అర్హులు ఉన్నారో ప్రతి ఒక్క చేనేత కార్మికుడికి నేతన్న సేవ పథకం 25 వేల రూపాయల డబ్బులు అకౌంట్లో జమ అయ్యేటట్టు చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు.అలాగే మున్సిపల్ ఆఫీస్ నందు మున్సిపల్ కమిషనర్ , హ్యాండ్లూమ్ ఆఫీసర్స్ ని కలవడం జరిగింది అని తెలిపారు.వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది అని తెలిపారు.అర్హత ఉన్న ప్రతి ఒక్క చేనేత కార్మికుడికి న్యాయం చేసే విధంగా పనిచేస్తామని హ్యాండ్లూమ్ అధికారులు తెలిపారు.ఎవరివైనా ఇంకా లిస్టులో పేరు రానివారు ఆగస్టు 14 వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు వారి గ్రామ, వార్డు సచివాలయాల్లో అప్లికేషన్ ఇవ్వాలని హ్యాండ్లూమ్ ఆఫీసర్ తెలపడం జరిగిందన్నారు. అలాగే ఎవరు అయితే అవినీతి కి పాల్పడిన సచివాలయ ఉద్యోగుల పైన చర్యలు తీసుకుంటాము అని అయన తెలిపారు. ఈ కార్యక్రమానికి సిపిఎం చేనేత సంఘం నాయకులు మద్దతు తెలిపారు కార్యక్రమంలో చేతివృత్తుదారుల రాష్ట్ర అధ్యక్షుడు జింక చలపతి , ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బుడగ వెంకటనారాయణ, జిల్లా గౌరవ అధ్యక్షులు గుర్రం వెంకటస్వామి, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు సిపిఎం నాయకులు జంగాలపల్లి పెద్దన్న, రమణ, బాషా, ఆయుబ్ ఖాన్,, సిపిఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవికుమార్, పట్టణ సహాయ కార్యదర్శి ఎర్రంశెట్టి రమణ, మంజుల నరేంద్ర,శ్రీనివాసులు, పట్టణ నాయకులు ఆదినారాయణ, శ్రీనివాసులు, వెంకటస్వామి సంకరాపు రాజా,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు