Sunday, December 7, 2025
Homeఆంధ్రప్రదేశ్బలహీనపడుతున్న దిత్వా.. కోస్తా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

బలహీనపడుతున్న దిత్వా.. కోస్తా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

- Advertisement -

నైరుతి-పశ్చిమ బంగాళాఖాతంలో దిత్వా తుపాను తీవ్ర స్థాయిలో కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.ఈ తుఫాన్ నైరుతి దిశలో కదలుతూ కొద్ది గంటలలో వాయుగుండం స్థాయికి చేరవచ్చే అవకాశం ఉందని అధికారులు సూచించారు.ప్రస్తుతానికి ఈ తుఫాన్ ఉత్తర తమిళనాడు తీరాన్ని చేరుకున్నట్లు సమాచారం.దిత్వా ప్రభావంతో 24 గంటల్లో కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 30 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.ఈ నేపథ్యంలో, కోస్తాంధ్ర జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు.అలాగే, కొన్ని ప్రాంతాల్లో 5 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం పడే అవకాశం ఉందని అధికారులు సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు