Homeజిల్లాలుశ్రీ సత్యసాయిడ్వాక్రా మహిళలకు డిజిటల్ పొదుపు, భద్రతపై అవగాహన..

డ్వాక్రా మహిళలకు డిజిటల్ పొదుపు, భద్రతపై అవగాహన..

- Advertisement -

మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య
విశాలాంధ్ర ధర్మవరం:: డ్వాక్రా మహిళలకు డిజిటల్ పొదుపు, భద్రతపై అవగాహన కల్పించడం జరిగిందని మునిసిపల్ కమిషనర్ వెంకటరమణయ్య, టౌన్ ప్రాజెక్టు ఆఫీసర్ భాస్కర్, టౌన్ మిషన్ మేనేజర్ లక్ష్మీనారాయణ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ పట్టణంలోని 43 నందు గల డ్వాక్రా సంఘాల మహిళలు పొదుపు చేస్తున్న నగదు మొత్తాన్ని డిజిటల్ పద్ధతిలో మొబైల్ నందు భద్రపరిచే విధంగా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రూపొందించిన ప్రత్యేక యాప్ అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ అవగాహన ర్యాలీని నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రతి మహిళ సంఘములోని ప్రతి సభ్యురాలు ఈ యాప్ను వినియోగించుకోవాలని తెలిపారు. డిజిటల్ లావాదేవీలకు మహిళలు అలవాటు పడాలని తెలిపారు. ప్రత్యేక యాప్ను ప్రతి సభ్యురాలు తప్పనిసరిగా వినియోగించుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా మహిళలకు యాప్ డౌన్లోడ్ విధానము ,వినియోగము, డిజిటల్ లావాదేవీల, భద్రత, పొదుపు సొమ్ము నిర్వహణపై మెప్మా సిబ్బంది కూడా వివరించడం జరిగిందని తెలిపారు. మహిళల ఆర్థిక సాధికారతకు, సాంకేతికను చేరువచేయుటలో ఈ యాప్ కీలకంగా నిలుస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మెప్మా సిబ్బంది, ఆర్పీలు మహిళలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు