Homeజాతీయంప్రకాశ్ రాజ్ ఓటు తొలగింపుపై ఈసీ క్లారిటీ

ప్రకాశ్ రాజ్ ఓటు తొలగింపుపై ఈసీ క్లారిటీ

- Advertisement -

బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి తన పేరును తొలగించడంపై విమర్శలు గుప్పించిన ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్‌కు ఎన్నికల కమిషన్ (ఈసీ) గట్టి కౌంటర్ ఇచ్చింది. ఆయన ఓటును తాము ఏకపక్షంగా తొలగించలేదని, అసలు నిబంధనల ప్రకారమే ఈ చర్య తీసుకున్నామని స్పష్టం చేసింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) సర్వేలో భాగంగా అధికారులు పరిశీలనకు వెళ్లినప్పుడు, ప్రకాశ్ రాజ్ నాలుగేళ్ల క్రితమే తన నమోదిత చిరునామా నుంచి వేరే ప్రాంతానికి మారినట్లు వెల్లడైందని ఈసీ తెలిపింది. తాను వేరే చోట నివసిస్తున్న విషయాన్ని ప్రకాశ్ రాజ్ స్వయంగా అంగీకరించారని, కొత్త చిరునామా ఆధారంగా ఓటును పునరుద్ధరించుకోవడానికి ఫారమ్ 6 దాఖలు చేసుకోవచ్చని స్పష్టతనిచ్చింది. కాగా, బెంగళూరులోని తన సొంత నియోజకవర్గం ఓటర్ల జాబితా నుంచి పేరు మాయమవ్వడంపై ప్రకాశ్ రాజ్ అంతకుముందు సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. తాను పుట్టి పెరిగిన ఊర్లోనే తన ఓటును తొలగించడం శోచనీయమని, ఇది ఒక పెద్ద జోక్ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తన ఒక్కడిదే కాకుండా ఏకంగా 65 లక్షల మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి గాల్లోకి లేపేశారని ఆరోపిస్తూ ఒక వీడియో విడుదల చేశారు. ఏది ఏమైనా న్యాయపోరాటం చేసి లేదా దరఖాస్తు చేసుకుని తన ఓటును మళ్లీ సాధించుకుంటానని ఆయన తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే ఈసీ ఈ అంశానికి సంబంధించి వివరణ ఇచ్చింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు