Homeజిల్లాలుఅల్లూరి సీతారామ రాజుఉపాధి హామీని పునరుద్ధరించాలి

ఉపాధి హామీని పునరుద్ధరించాలి

- Advertisement -

ఆదివాసి గిరిజన సంఘం డిమాండ్

విశాలాంధ్ర- డుంబ్రిగుడ ( అల్లూరి జిల్లా): ఉపాధి హామీని పునరుద్ధరించాలని ఆదివాసి గిరిజన సంఘం డిమాండ్ చేసింది. శుక్రవారం సాగర పంచాయతీ అడప వలస గ్రామంలో గిరిజన సంఘం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సూర్యనారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన కొత్త చట్టం బి వి జి రామ్ జి నూతన చట్టాన్ని ప్రతి ఉపాధి కూలి వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. ఉపాధి చట్టం పరిరక్షణకు 5 తేదీన మండల కేంద్రంలో జరిగే ధర్నాలో వేలాదిమంది ఉపాధి కూలీలు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి గిరిజన సంఘం నాయకులు ఉపాధి కూలీలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు