మండల విద్యాశాఖ అధికారులు రాజేశ్వరి దేవి, గోపాల్ నాయక్
విశాలాంధ్ర ధర్మవరం : పట్టణము గ్రామీణ ప్రాంతాలలో ప్రస్తుతం ఒంటిపూట బడులు ప్రారంభం కావడం జరిగిందని, ఈ క్రమంలో మధ్యాహ్నము నుండి అదనపు తరగతులు ఎవ్వరూ కూడా నిర్వహించరాదని మండల విద్యాశాఖ అధికారులు రాజేశ్వరి దేవి, గోపాల్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున, విద్యార్థులు వడదెబ్బకు గురికావలసి వస్తుందని, అందుకే అదనపు తరగతులు ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ పాఠశాలలలోనూ, ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో నిర్వహించరాదని వారు స్పష్టం చేశారు. ఇప్పటికే కొన్ని ప్రైవేట్ పాఠశాలలు నడుపుతున్నట్టు మా దృష్టికి వచ్చిందని, అలా కాకుండా వెనువెంటనే అదనపు తరగతులను తొలగించాలని తెలిపారు. లేనియెడల డీఈఓ ఆదేశాల మేరకు ఆ పాఠశాలలపై కఠిన చర్యలను గైకొంటామని వారు హెచ్చరించారు.
ఒంటిపూట బడులలో అదనపు తరగతులు నిర్వహించరాదు
RELATED ARTICLES