విశాలాంధ్ర, డి.హీరేహల్: మండలంలోని చెర్లోపల్లి గ్రామానికి చెందిన సతీష్‌రెడ్డి విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న సతీష్‌రెడ్డికి రెండేళ్ల క్రితం సోమలాపురం గ్రామానికి చెందిన నందినితో వివాహమైంది. గురువారం ఉదయం 11 గంటల సమయంలో వరి నాట్ల కోసం పక్క పొలంలో ఉన్న శంకరప్ప పొలంలోని మోటార్‌ను ఆన్ చేసేందుకు సతీష్‌రెడ్డి వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్ తగలడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. చుట్టుపక్కల వారు గమనించి వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేసి అతడిని పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు.మృతుడి తండ్రి రామిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గురు ప్రసాద్‌రెడ్డి తెలిపారు.


