జిల్లా వ్యవసాయ అధికారి కృష్ణయ్య
విశాలాంధ్ర ధర్మవరం; రైతులు వివిధ పంటల్లో పాటించవలసిన సమగ్ర ఎరువుల యాజమాన్యం ఆచరించాలని, భూమితో పాటు ప్రజల ఆరోగ్యం కూడా కాపాడుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి కృష్ణయ్య తెలిపారు. ఈ సందర్భంగా వారు
చిగిచెర్ల గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి జి కృష్ణయ్య,లీడ్ బ్యాంక్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఫణీంద్ర కుమార్ , నాబార్డ్ డిడిఎం సాయికిరణ్, , డాట్ సెంటర్ కో ఆర్డినేటర్ కే రామసుబ్బయ్య ,
ఏపీజీబీ బ్యాంక్ మేనేజర్ సౌమ్య
ధర్మవరం ఏ డి ఏ ఎల్ లక్ష్మనాయక్, పశువైద్యాధికారి శేఖర్, మండల వ్యవసాయ అధికారి ముస్తఫా, ఉద్యాన అధికారి ఈ శ్రీనివాసులు, క్రాప్ ఇన్సూరెన్స్ కంపెనీ డిస్టిక్ కో ఆర్డినేటర్ దాసు, సిరి కల్చర్ అసిస్టెంట్ నారాయణస్వామి,వి హెచ్ ఎ శిరీష,ఎం పి ఈ ఓ మీన,నాయకులు ఓబిరెడ్డి ,రాఘవరెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది. అనంతరం
సహాయ వ్యవసాయ సంచాలకులు ధర్మవరం శ్రీ లక్ష్మ నాయక్ వివిధ పంటల్లో పాటించవలసిన సమగ్ర ఎరువుల యాజమాన్యం గూర్చి వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ అన్ని ఆర్.ఎస్.కే లలో ఎరువులు నిలువ
ఉంచుకోవాల్సిందిగా వారు తెలిపారు. ఎస్సీ ఎస్టీ క్యాటగిరికి సంబంధించి పది లక్షల విలువగల డ్రోన్లు 80 శాతము సబ్సిడీతో సరఫరా చేయబడును అని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలిపారు. వాతావరణ బీమా పథకంలో బత్తాయి, వేరుశనగ ,పత్తి , దానిమ్మ, టమోటా పంటలకు ప్రీమియం చెల్లించడానికి గడువు జూలై నెల 24 వరకు పొడిగించినట్లు తెలిపారు. ఫసల్ బీమా పథకంలో మొక్కజొన్న, కంది, రాగి, ఆముదం పంటలకు జులై నెల 31 వ తారీకు వరకు, వరి పంటకు ఆగస్టు 15 వరకు ప్రీమియం చెల్లింపు గడువు ఉన్నట్లు తెలియజేశారు. అనంతరం నాబార్డ్ డి డి ఎం శ్రీ సాయి కిరణ్ ఏపీజీబీ మేనేజర్ సౌమ్య మాట్లాడుతూ రుణాల కోసం ప్రైవేటు వ్యక్తుల మీద ఆధారపడకుండా పంట రుణాలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలిపారు.పండిన పంటలు నిల్వ ఉంచుకొని ధర ఉన్నప్పుడు అమ్ముకోవడానికి వీలుగా ఉన్న ఋణ పథకాలను , కాల పరిమితి రుణాల( ట్రాక్టర్,గొర్రెలు, మో” )గురించి వివరించడం జరిగిందన్నారు.లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ రైతులు సాగు చేసి ఈ పంటలో నమోదు చేసిన పంటలకు పంటల బీమా పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానిక ఏపీజీబీ మేనేజర్ సౌమ్యకు సూచించడం జరిగిందన్నారు.
రామసుబ్బయ్య ఏరువాక కేంద్రం పుట్టపర్తి వారు జూన్ మాసంలో సాగుచేసిన వేరుశనగ కంది , ఆముదం పంటలు బెట్ట గురికాకుండా పొటాషియం నైట్రేట్ అయిదు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయవలెను అని తెలిపారు
సాళ్ల మధ్యలో కలుపు లేకుండా చూసుకోవలెను బెట్ట పరిస్థితి నుంచి పంట పైన ప్రభావం తగ్గించడానికి వరుసల మధ్యలో మొక్కల సంఖ్యను తగ్గించవలెను అని సూచించారు. పశువైద్యాధికారి శేఖర్ ఉద్యాన అధికారుల శ్రీనివాసులు, సిరికల్చర్ అధికారి నారాయణస్వామి తమ శాఖల అమలవుతున్న వివిధ పథకాలను రైతులకు వివరించారు.
రైతులు వివిధ పంటల్లో పాటించవలసిన సమగ్ర ఎరువుల యాజమాన్యం ఆచరించాలి..
- Advertisement -
RELATED ARTICLES


