Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపట్టణ పరిశుభ్రత అందరి బాధ్యత

పట్టణ పరిశుభ్రత అందరి బాధ్యత

- Advertisement -

ప్రజల నుండి ఫిర్యాదులు అందితే కఠిన చర్యలు తప్పవు..

మున్సిపల్ కమిషనర్ వెంకట రమణయ్య.
విశాలాంధ్ర ధర్మవరం; పట్టణ పరిశుభ్రత అందరి బాధ్యత అని, ప్రజల నుండి ఫిర్యాదులు అందితే సంబంధిత ఉద్యోగులపై, వర్కర్లపై కఠిన చర్యలు తప్పవు అని మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని వార్డు శానిటేషన్, పర్యావరణ కార్యదర్శులతో సీజనల్ వ్యాధుల నివారణపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ పట్టణంలోని ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలలో ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, చెత్తను ఎప్పటికప్పుడు తొలగించడం, కాలువల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టడం లాంటివి పై ప్రత్యేక శ్రద్ధను కనపరచాలని తెలిపారు. ఎక్కడ ఎటువంటి అపరిశుభ్రత ఉండరాదని, అలా ఉన్నట్లు సమాచారం అందితే మేస్త్రీలు శానిటరీ ఇన్స్పెక్టర్లు వేలు వెంటనే చర్యలు తీసుకోక తప్పదు అని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ ఉమామహేశ్వరరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్యాం సన్, మేస్త్రీలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు