Homeతెలంగాణఅమీర్‌పేటలోని కోచింగ్‌ సెంటర్‌లో అగ్నిప్రమాదం.. చిక్కుకున్న విద్యార్థులు

అమీర్‌పేటలోని కోచింగ్‌ సెంటర్‌లో అగ్నిప్రమాదం.. చిక్కుకున్న విద్యార్థులు

- Advertisement -

అమీర్‌పేట మైత్రీవనం చౌరస్తాలోని ఆదిత్య ఎన్‌క్లేవ్‌ భవనంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కాంప్లెక్స్‌లోని ఓ కోచింగ్‌ సెంటర్‌లో మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సమయంలో నాలుగో అంతస్తులో క్లాసులు జరుగుతున్నాయి. దీంతో పలువురు విద్యార్థులు అందులో చిక్కుకుపోయారు. ఒక్కసారిగా పొగ కమ్మేయడంతో లోపల ఉన్న విద్యార్థులకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. బయటకు వచ్చే దారి కూడా పొగతో నిండిపోవడంతో విద్యార్థులు బాల్కనీల్లోకి వచ్చి రక్షించాలంటూ హాహాకారాలు చేశారు. కొందరు భయం ఆపుకోలేక కిందకు దూకే ప్రయత్నం చేయగా, స్థానికులు వారిని వారించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. విద్యార్థులను బయటకు తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని ప్యానెల్‌ బోర్డులో షార్ట్‌సర్క్యూట్‌ వల్ల మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు