విశాలాంధ్ర – గుడిబండ: గుడిబండ మండల పరిధిలోని కె.ఎన్.పల్లి గ్రామ మాజీ సర్పంచ్ మహాలింగప్ప మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఛాతిలో నొప్పి రావడంతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనకు గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మహాలింగప్ప మృతి పట్ల టీడీపీ సీనియర్ నాయకులు శ్రీనివాసమూర్తి, పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.మహాలింగప్ప మృతి కె.ఎన్.పల్లి గ్రామానికి తీరని లోటని పేర్కొంటూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా టీడీపీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు మంజునాథ్, మాజీ ఎంపీటీసీ భోజరాజు, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని నివాళులర్పించారు.
కె.ఎన్.పల్లి మాజీ సర్పంచ్ మహాలింగప్ప కన్నుమూత..
- Advertisement -
RELATED ARTICLES


